ఓటర్ల నమోదులో ముస్లిం వివక్ష
ఓటర్ల నమోదులో ముస్లిం వివక్ష
ఓటర్ల నమోదులో
ముస్లిం వివక్ష చాలా పెద్ద స్థాయిలో
సాగుతోంది. దీని గురించి సోషల్ మీడియాలో అవగాహన ప్రచారం సాగించాము. ప్రధాన మీడియాలో పత్రికా విలేఖరుల సమావేశం
పెట్టి సమస్యను ప్రజల దృష్టికి, వివిధ
రాజకీయ పార్టీల దృష్టికి, సంబంధిత
ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేశాము.
ఈ
వ్యవహారాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ –
ఐటి నిపుణులు ష్ర్క్ హుస్సేన్ గారికి అప్పచెప్పాము. వారు వివిధ లాగరిధమ్స్ ద్వార
కొన్ని రికార్డులు పరిశీలించి కొన్ని రిపోర్టులు కూడా సమర్పించారు.
అయితే,
సమస్య పరిష్కారానికి అది సరిపోదు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా ఒక ముస్లీం ఎన్ జివో
ఈ సమస్యను టేకప్ చేసింది. ఓటర్ల జాబితా నుండి తొలగింపుకు గురయిన దాదాపు నాలుగయిదు లక్షల మంది ముస్లిం ఓటర్లను
తిరిగి నమోదు చేయించింది.
ముస్లిం
థింకర్స్ ఫోరం (MTF) కర్ణాటక ముస్లిం సంస్థల తోనూ సంప్రదింపులు జరిపింది. ఇది భారీ
ప్రాజెక్టు. 175 నియోజక వర్గాలలో సర్వే దళాలు పనిచేయాలి. కనీసం 40 - 50 లక్షల రూపాయల నిధులు కావాలి, ఓ రెండు
వేలమంది కార్యకర్తలు కావాలి. నియోజకవర్గానికి 200 బూతులుంటాయి. ఓటర్ల లిస్టు
తీసుకోవాలంటే 20 వేల రూపాయలు కావాలి. అలా 175 నియోజకవర్గాలు. పరిమిత మానవ వనరులు,
ఆర్ధిక వనరులతో ఇది MTFకు సాధ్యమయ్యే
పనికాదు.
ఎవరికి
వారు తమ ఓటరులిస్టులో తమ పేరు వుందోలేదో చెక్ చేసుకోవాలని విస్తృతంగా ప్రచారం
చేయాలి. ఎన్నికల్లో నామినేషన్ల గడువు
ముగిసే వరకూ ఓటరు పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం వుంటుంది.
Comments
Post a Comment