United Front of Depressed Sections
అణగారిన
వర్గాల ఐక్య సంఘటన
ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటిఎఫ్)
నిర్ణయించుకున్న విధానాల్లో అణగారిన సమూహాల ఐక్య సంఘటన కీలకమైనది. గత ఏడాది “దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రైస్తవులపై దాడుల్ని
ఖండించాలి”, “దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రైస్తవులు, బలహీనవర్గాలు – అణగారిన సమూహాల ఆత్మగౌరవ సభ” అనే
అంశాల మీద ఎనిమిది సదస్సులు నిర్వహించాము. ఈ సదస్సులు అన్నింటికీ సోదర అణగారిన సమూహాలయిన
దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, క్రైస్తవులు,
బలహీనవర్గాల ప్రతినిధుల్నేగాక పౌరహక్కులు, మానవహక్కులు, సామ్యవాదులు, విప్లవవాదుల
ప్రతినిధుల్ని కూడా ఆహ్వానించాము. అలాగే, ముస్లిమేతర అణగారిన సమూహాలు నిర్వహించిన అనేక
సభలు, కార్యక్రమాల్లో మన సభ్యులు చాలా చురుగ్గా పాల్గొన్నారు. రంజాన్ నెలలో ‘దళితులతో
ఇఫ్తార్’ అంటూ ఎంటిఎఫ్ ఇచ్చిన పిలుపుకు ఆంధ్రప్రదేశ్
తెలంగాణ రాష్ట్రాల్లో మంచి స్పందన వచ్చింది. ఆ కార్యక్రమం ఇంకా కొనసాగుతూంది. అనుక్షణం
మనం ఐక్యసంఘటన విలువల్ని కాపాడుతూ వస్తున్నాము.
ఇప్పుడు ఒంగోలులో నిర్వహిస్తున్న
‘ఆంధ్రా ముస్లింలు – రాజకీయ దశదిశ -2019’ ముస్లింల మేధోమధన రాష్ట్ర సదస్సు అనేక
విధాలా ప్రత్యేకమైనది. రాబోయే
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ముస్లింల రాజకీయ విధానాన్ని రూపొందించడం దీని లక్ష్యం.
ఎన్నికల్లో మన విధానం ఏమిటో ముందు నిర్ణయం కావాలి. మన ఎన్నికల విధానం నిర్ణయం కాకుండా ఇతర సమూహాలతో
ఐక్య సంఘటనకు అసలు ప్రాతిపదికే వుండదు. అంచేత
ఈ సదస్సులోని అంతర్గత చర్చల్లో ముస్లింలుతప్ప ముస్లిమేతర్రులు పాల్గొనే అవకాశంలేదు.
ముస్లిమేతర్రులు పాల్గొనడం సరైనదీకాదు. ఇది
కేవలం ముస్లింల మేధోమధన సదస్సు.
మరోమాటల్లో
చెప్పాలంటే, ఒంగోలు సదస్సు ముస్లింల కోసం,
ముస్లింల ద్వార , ముస్లింల చేత నిర్వహిస్తున్న
సదస్సు.
ఒంగోలు సదస్సు ఒక విధాన నిర్ణయం చేస్తుంది. దాని
తీర్మానం మేరకు ఆ తరువాత ఇతర అణగారిన సమూహాల
సంఘాలతో మనం ఐక్య సంఘటనలు నిర్మిస్తాం.
రాజకీయ పార్టీలు
వేరు ప్రజా సంఘాలు వేరని ఈ సందర్భంగా గుర్తు పెట్టుకోవాలి. ఒంగోలు సదస్సులో ప్రజా సంఘాల
ప్రతినిధులు, ఆలోచనాపరులు ఎలాగూ పాల్గొంటారు. అయితే రాజకీయ పార్టీల క్రీయాశీల కార్యకర్తలు,
నాయకులకు ఒక పరిమితి వుంది. వాళ్ళూ తమ రాజకీయ
పార్టీ ప్రతినిధిగా పాల్గొనడానికి వీల్లేదు. ఒక ముస్లిం శ్రేయోభిలాషిగా
మాత్రమే వాళ్ళు తమ ప్రతిపాదనలు చేయవచ్చు. మనం
ఏ రాజకీయ పార్టీ ప్రతినిధిని కూడా ఒంగోలు సదస్సుకు ఆహ్వానించడంలేదు.
కీలక సదస్సుల
ప్రారంభ సమావేశాల్లో సౌహార్ధ్ర ప్రతినిధులు శుభాకాంక్షలు చెప్పే సాంప్రదాయం ఒకటుంది.
ఒంగోలు సదస్సులో కూడా ఒక్కొ సంఘం ప్రతినిధి
ఐదు నిముషాలకు మించకుండా తమ సందేశాన్ని ఇవ్వవచ్చు. ఇలా ఓ ఆరు సంఘాలకు మనం అవకాశం ఇవ్వవచ్చు.
అయితే, సౌహార్ధ్ర
ప్రతినిధులుగా ఎవరిని ఆహ్వానించాలీ? అనేది కూడా విధానపరమైన అంశమే. ఇక్కడ కూడా ముస్లిం
సంఘాలకు మాత్రమే అవకాశం కల్పించాలా? లేకుంటే ముస్లిమేతరుల్ని కూడా ఆహ్వానించవచ్చా?
అనేది ఒక చర్చనీయాంశం. సౌహార్ధ్ర ప్రతినిధులుగా
ముస్లిం సంఘాలకు మాత్రమే అవకాశం కల్పించాలని మన సభ్యులు సూచిస్తున్నారు. మనం వాళ్ళ
సూచనలనే పాటిద్దాం. అలాంటి సోదర సంఘాలు నా
దృష్టిలో MHPS, ముస్లిం నగారాలు వున్నాయి. మరో నాలుగు సంఘాల పేర్లు సూచించండి. సదస్సు ప్రారంభ సమావేశంలో అందరికీ అరగంట సమయం కేటాయించే వీలుంది.
మీరంతా స్పందించండి.
13 June 2018
Comments
Post a Comment