Ongole Programme
Ongole Programme
ఆంధ్రా ముస్లింలు – రాజకీయ దశదిశ -2019
ముస్లింల మేధోమధన రాష్ట్ర సదస్సు
23, 24 జూన్ 2018 - ఒంగోలు
కార్యక్రమం
1.
రెండు రోజుల సదస్సులో మొత్తం 7 లేదా 8 సెషన్స్ వుంటాయి.
2.
మొదటిది ప్రారంభ సమావేశం.
ఇది మూడు గంటలు వుంటుంది.
3.
ప్రారంభ సమావేశంలో ముఖ్య అతిథితో పాటూ ఆహ్వాన సంఘం బాధ్యులు, MTF ప్రముఖులు, ఇతర ముస్లిం సంఘాల ప్రముఖులు
ప్రసంగిస్తారు. సోదర సంస్థలు శుభాకాంక్షలు తెలుపుతాయి.
4.
రెండు రోజుల సదస్సులో 5 లేదా 6 మేధోమధన సెషన్స్ వుంటాయి.
5.
చివర్లో సమీక్షా, తీర్మానం కోసం ఒక సెషన్ వుంటుంది.
6.
ఒక్కో సెషన్ వ్యవధి 2 గంటలు.
7.
ఒక్కో సెషన్ లో 6 స్లాట్లు
వుంటాయి.
8.
ఒక్కో స్లాటు వ్యవధి 20 నిముషాలు.
9.
ప్రతి స్లాట్ లో ఒక ప్రతిపాదకులు, ఇద్దరు ప్రతిస్పందకులు వుంటారు.
10.
ప్రతిపాదకులకు 10 నిముషాలు; ప్రతిస్పందకులు ఇద్దరికి చెరో 5 నిముషాల వ్యవధి వుంటుంది.
11.
ప్రతిపాదకులు, ప్రతిస్పందకులు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా కావచ్చు.
అయితే, వారు తమ పార్టీ ప్రతినిధులుగా గాకుండా ముస్లిం సమాజ శ్రేమోభిలాషులుగా
మాత్రమే ప్రతిపాదనలు, చర్చలు చేయాలి.
12.
ఒంగోలు ముస్లిం మేధోమదన సదస్సు థీమ్ “ముస్లిం ఓటు శక్తిని చాటుదాం !” ”ముస్లిం ఓటుకు గుర్తింపును సాధించుదాం !!”
13.
ప్రతిపాదకులు సదస్సు థీమ్ కు మాత్రమే కట్టుబడి ప్రసంగించాలి.
14.
వచ్చే ఎన్నికల్లో “ముస్లిం ఓటు శక్తిని చాటడానికీ,
”ముస్లిం ఓటుకు గుర్తింపును సాధించుకోవడానికీ ముస్లిం సమాజం ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలో ప్రతిపాదకులు ఆ
10 నిముషాల్లో సూటిగా స్పష్టంగా ప్రతిపాదించాలి.
15.
ప్రతి ప్రతిపాదకుల ప్రతిపాదనల
మీద ఇద్దరు ప్రతిస్పందిస్తారు.
16.
ప్రతిస్పందికులు కూడా ప్రతిపాదన అంశానికి మాత్రమే కట్టుబడి 5
నిముషాల్లో ప్రతిస్పందనను ముగించాలి.
17.
ప్రతిపాదకుల ప్రతిపాదనను ప్రతిస్పందికులు సమర్ధించనూవచ్చు లేదా
విమర్శించనూ వచ్చు.
18.
ఒక స్లాట్ లో ప్రతిస్పందికులుగా
వున్నవారు ఇంకో స్లాట్ లో ప్రతిపాదితులుగా
వుండవచ్చు. అలాగే ఒక స్లాట్ లో
ప్రతిపాదితులుగా వున్నవారు ఇంకో స్లాట్ లో ప్రతిస్పందికులుగా వుండవచ్చు.
19.
మొత్తం 30 లేదా 36 మంది తమ ప్రతిపాదనలు చేస్తారు. మొత్తం 60 లేదా 72 మంది తమ ప్రతిస్పందనను
తెలుపుతారు.
20.
సమీక్ష సెషన్ లో సదస్సు తీర్మానాన్ని రూపొందిస్తారు.
21.
ప్రతి సెషన్ కూ ఒక కో-ఆర్డినేటర్, ఒక మినిట్స్ రికార్డర్ వుంటారు.
22.
మేధోమధనంలో సమయపాలనను చాలా కఛ్ఛితంగా పాటించాలి.
23.
అందరూ తమ ఉపన్యాసాలను హోంవర్క్ చేసి నిర్ణిత గడువు లోగా ముగిసేలా ముందుగానే
తయారు చేసుకుని రావాలి.
24.
వక్తలకు సమయం ముగియడానికి ఒక నిముషం ముందు హెచ్చరిక చేస్తారు. వ్యవధిలోపు
ముగించడం వారి బాధ్యత. లేకుంటే మైక్ కట్ అయిపోతుంది.
25.
ఒకరికి తక్కువ సమయం, మరొకరికి ఎక్కువ సమయం ఇవ్వడం అనే ప్రసక్తే లేదు.
Comments
Post a Comment