BC census first then Panchayat Raj poll: Hyderabad High Court

BC census first then Panchayat Raj poll: Hyderabad High Court
DECCAN CHRONICLE.
Published Jun 27, 2018, 5:18 am ISTUpdated Jun 27, 2018, 5:18 am IST

Justice M.S. Ramachandra Rao, while dealing with two petitions by Congress leaders B. Ravindranath, Dasoju Sravan Kumar and Ayyorupalle.
Hyderabad High Court
 Hyderabad High Court
Hyderabad: In a setback to the Telangana state government, the Hyderabad High Court on Tuesday directed the government to issue notification to conduct elections to Panchayat Raj institutions  only after  completion of the enumeration of Backward Classes voters and after publishing the figures and reserving seats for BCs.

Justice M.S. Ramachandra Rao, while dealing with two petitions by Congress leaders B. Ravindranath, Dasoju Sravan Kumar and Ayyorupalle Gram Panchayat in Karimnagar district, granted the interim order stating that the Gram Panchayat Rules 2007 relating to denotification, deletion, show cause, objections and re notification have to be followed pursuant to Section 295 of the Telangana State Panchayat Raj Act 2018.

K.S. Murthy and B. Rachna Reddy, counsels for the petitioners, submitted that the state government has initiated the process for conducting the elections to Panchayat Raj institutions in the state without counting persons belonging to the BC communities ward wise and not allotting seats reserved for BC category amongst the sub groups A, B, C, D and E.

They submitted that the Supreme Court has held that the elections to Panchayat Raj bodies be conducted only after a scientific survey of the voters belonging to BC communities and the state government has so far not conducted any such survey.

Hyderabad HC stays Gram Panchayat polls in TS
The Congress leader approached the court seeking justice for the BC community before the elections in the State.
AddThis Sharing Buttons
Facebook Twitter Google+ LinkedIn Pinterest
By AuthorTelanganaToday  |  Published: 26th Jun 2018  7:55 pmUpdated: 26th Jun 2018  8:35 pm
gram panchayat election
Hyderabad: The High Court on Tuesday stayed the gram panchayat election process in the State. The court wanted the State government to conduct the enumeration of backward classes in a scientific manner before going in for the gram panchayat polls.

In its interim order issued in response to the writ plea filed by Congress spokesperson Dasoju Sravan Kumar, the High Court directed the State government to complete BC enumeration before the elections so as to facilitate due representation of the community in the polls.



The Congress leader approached the court seeking justice for the BC community as the election process was being initiated by the State government without following due procedure in BC reservations, though they made several appeals.

The court also questioned the government to know on what basis the government declared 34 per cent reservations for the BCs in the upcoming gram panchayat elections. Additional Advocate General explained to the court that the government was ready to conduct the gram panchayat elections and that notification is also expected within a couple of days.

Any judgement will effect timely conduct of local body elections, he stressed. The court wanted the State to complete BC enumeration process scientifically and initiate the process for the conduct of the elections.

Speaking to the media, the petitioner, Dasoju Sravan Kumar, said the party’s intention was not to disturb the elections, but it has been demanding the State government to give judicious share to BCs in local body elections. “Several times we requested the State government to allocate 50 per cent reservations to BCs and conduct BC enumeration before finalising the reservation percentage, but they did not accepted our plea, hence we approached the court for justice to BCs,” he said.

The State government has already made all necessary arrangements and is keen on conducting gram panchayat elections in the end of July as per schedule. For the past several months, the Panchayat Raj Department was working hard to complete all required procedures, including preparing rosters for the local body elections, but the High Court’s Tuesday judgement may delay elections.

పంచాయతీ లేనట్టే..!
27-06-2018 02:01:12


హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ‘వాయిదా’ అనివార్యం
సమగ్రంగా బీసీ జన గణన చేయండి
ఆ వర్గం ఓటర్లు ఎందరో లెక్కించండి
వర్గీకరణ లేకుండా ఎన్నికలు ఎలా!?
ముందు విధివిధానాలు పూర్తి చేయండి
ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకోండి
దాసోజు శ్రవణ్‌ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా
పాలక మండళ్లకు 35 రోజులే గడువు
పర్సన్‌ ఇన్‌చార్జుల నియామకానికే మొగ్గు
‘‘బీసీ జన గణనను బీసీ కమిషన్‌ చేయాల్సి ఉండగా.. స్టాటిస్టిక్స్‌ డైరెక్టరేట్‌ ఎలా చేస్తుంది!? బీసీ జనాభా ఎంతో తెలియకుండా, ఏబీసీడీ వర్గీకరణ జరపకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? ముందుగా బీసీ జనాభాను లెక్కించాలి. దాన్ని బహిరంగంగా ప్రకటించాలి. దానిపై అభ్యంతరాలు స్వీకరించాలి. ఆ తర్వాతే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలి. చట్ట ప్రకారం విధి విధానాలను పూర్తి చేసిన తర్వాతే, పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలి. - హైకోర్టు ధర్మాసనం
హైదరాబాద్‌, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు బ్రేక్‌ పడింది. గడువులోపు వాటిని నిర్వహించే అవకాశాలు లేనట్లే. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపు పూర్తయినా.. వాయిదా వేయడం అనివార్యం కానుంది. ఇందుకు కారణం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే! ‘‘బీసీ గణన చేయకుండా.. జనాభా ఎంతో తెలియకుండా.. ఏ బీ సీ డీ వర్గీకరణ జరగకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు? పంచాయతీ ఎన్నికలకు వెళ్లే ముందు.. చట్టం నిర్దేశించిన విధి విధానాల్లో భాగంగా బీసీ జనాభాను, ఓటర్లను లెక్కించాలి. ఆ జాబితాను బహిరంగంగా ప్రచురించి అభ్యంతరాలను స్వీకరించాలి. నిబంధనల మేరకు అన్ని విధి విధానాలను అమలు చేసిన తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలి’’ అని ఉమ్మడి హైకోర్టు తేల్చి చెప్పింది. దీనిపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో బీసీ
జనాభాను సక్రమంగా లెక్కించడం లేదని, జనాభా లెక్కింపు పూర్తయిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్‌ నేతలు బి.రవీంద్రనాథ్‌, దాసోజు శ్రవణ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారి పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు మంగళవారం మరోసారి విచారించారు. బీసీ జనాభాను లెక్కించకుండానే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని, జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది నివేదించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని తెలిపారు. ‘‘బీసీ జనాభా వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినా ఇవ్వడం లేదు. దీనిపై ప్రభుత్వం దగ్గర స్పష్టమైన సమాచారం లేదు. గణాంకాలు గందరగోళంగా ఉన్నాయి. బీసీ జనాభా 34 శాతమని ప్రకటించింది. కానీ, ప్రభుత్వం ఇచ్చిన బిల్లులో 37 శాతమని, సమగ్ర కుటుంబ సర్వేలో 54 శాతమని పేర్కొంది. ఒక్కోసారి ఒక్కో సంఖ్యను ప్రకటిస్తోంది. శాస్త్రీయ పద్ధతిలో బీసీ జనాభాను లెక్కించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది’’ అని వివరించారు. అయితే, బీసీ జనాభాను లెక్కించామని, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగంలో ఆ వివరాలు ఉన్నాయని అదనపు ఏజీ రామచందర్‌రావు నివేదించారు. దాంతో, బీసీ జనాభా సర్వేను బీసీ కమిషన్‌ చేయాల్సి ఉండగా.. స్టాటిస్టిక్స్‌ డైరెక్టరేట్‌ ఎలా చేస్తుందని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేస్తామని, ఇందుకు కొంత సమయం కావాలని అదనపు ఏజీ అభ్యర్థించారు. మరి, ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేస్తే ఎలా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేస్తే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నివేదించారు. రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దాంతో, చట్ట ప్రకారం బీసీ జనాభా లెక్కింపు పూర్తి కాకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. బీసీ జనాభాను లెక్కించి.. దాన్ని బహిరంగంగా ప్రచురించి.. అభ్యంతరాలను స్వీకరించి.. ఆ తర్వాతే ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అప్పటి వరకు ఎన్నికలు నిర్వహించవద్దని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వంతోపాటు ఎన్నికల సంఘం, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌కు నోటీసులు జారీ చేశారు. నాలుగు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని కోర్టు సర్కారును ఆదేశించారు. నిజానికి, బీసీ కమిషన్‌తో సర్వే చేయించడం, ఆ తర్వాత రిజర్వేషన్ల కోటా నిర్దేశించడం, వాటిని ఏబీసీడీఈగా వర్గీకరించడం సుదీర్ఘ ప్రక్రియ. ప్రస్తుత పాలక మండళ్ల గడువు మరో 35 రోజులు మాత్రమే మిగిలి ఉంది. సహజంగా కనీసం మూడు విడతల ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి కనీసం 25 నుంచి 30 రోజులు అవసరం. కానీ, విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ పరిస్థితులే గడువులోగా పంచాయతీలకు ఎన్నికలు జరపడం అసాధ్యమన్న విషయాన్ని తేల్చేస్తున్నాయి.

ప్రత్యేక అధికారులా? పర్సన్‌ ఇన్‌చార్జ్‌లా?
ప్రస్తుత పంచాయతీల పాలక మండళ్ల గడువు ఆగస్టు 1తో తీరనుంది. ఆగస్టు 2 నుంచి ప్రత్యేకాధికారులు లేదా పర్సన్‌ ఇన్‌చార్జ్‌లను నియమించనున్నారు. అయితే, ప్రత్యేకాధికారులకు బదులు పర్సన్‌ ఇన్‌చార్జ్‌ల పాలనను తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంటే, ప్రస్తుత పాలక మండళ్లనే మరికొంత కాలం కొనసాగించడం. ఈ మేరకు న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే పర్సన్‌ ఇన్‌చార్జ్‌ల పాలనకే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు
హైకోర్టులో బీసీ సంఘాల పిటిషన్‌..
కేంద్రం, ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రం, ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నా.. బీసీలకు అలా కల్పించడం లేదంటూ తెలంగాణ బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, ఏపీ బీసీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపక సభ్యుడు కె.ఆల్మెన్‌ రాజు సంయుక్తంగా సోమవారం లంచ్‌ మోషన్‌లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌. రామచంద్రరావు మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ వాదనలు విన్న హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాలను ఆదేశిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయుదా వేసింది.



పంచాయితీ ఎన్నికలకు హై కోర్టు బ్రేక్ కేసీఆర్‌కు హైకోర్టు షాక్: పంచాయితీ ఎన్నికలకు బ్రేక్
కేసీఆర్‌కు హైకోర్టు షాక్:  పంచాయితీ ఎన్నికలకు బ్రేక్
Narsimha Lode  26 June 2018 10:10 am
హైదరాబాద్: బీసీల రిజర్వేషన్ల శాతం తేలేవరకు  గ్రామ పంచాయితీ నోటీఫికేషన్  ఇవ్వకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది.  మంగళవారం నాడు ఈ విషయమై  కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్‌తో పాటు మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌పై  హైకోర్టు విచారించింది.

రెండు మూడు రోజుల్లో గ్రామ పంచాయితీ ఎన్నికల నోటీఫీకేషన్ జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం  అన్ని రకాల ఏర్పాట్లు  చేస్తోంది. ఈ తరుణంలో హైకోర్టు  ఇచ్చిన తీర్పు  ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ఎలా ఇచ్చారని  హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బీసీల్లోని ఏ, బీ, సీ, డీ  లకు రిజర్వేషన్లను తేల్చాలని హైకోర్టు అభిప్రాయపడింది.  బీసీల ఓటర్ల శాతాన్ని ఎలా నిర్ధారించారో చెప్పాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

బీసీల రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చాకే ఎన్నికల నోటీఫీకేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.అయితే ఇప్పటికే సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిన విషయాన్ని అడ్వకేట్ జనరల్  హైకోర్టులో ప్రస్తావించారు. 

రెండు, మూడు రోజుల్లో  ఎన్నికల నోటీఫీకేషన్ ఇవ్వనున్నట్టు అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. బీసీల రిజర్వేషన్ల ప్రక్రియ తేలిన  తర్వాతే నోటీఫీకేషన్ విడుదల చేయాలని  ఆదేశాలు జారీ చేసింది కోర్టు.తదుపరి విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది.


తెలంగాణ: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
Samayam Telugu | Updated:Jun 26, 2018, 05:00PM IST
1
1
rework the reservations for bcs: high court stay on gram panchayat elections in telangana
తెలంగాణ: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్
పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్, ఎన్నికల సంఘానికి హైకోర్ట్ ట్విస్ట్ ఇచ్చింది. రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చేవరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించొద్దని ఆదేశించింది. బీసీల రిజర్వేషన్ల ప్రక్రియను తప్పు బడుతూ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. బీసీలకు ఏ ప్రాతిపదికన 34శాతం రిజర్వేషన్లు కేటాయించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. రెండు, మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌కు సిద్ధమవుతున్నట్లు అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే సర్పంచ్, వార్డ్ మెంబర్ల పదవీకాలం ముగిసిందని కూడా తెలియజేశారు.
టాప్ వ్యాఖ్య
View
Sumit Panchariya
0 | 0 | 0 గొప్పా |జవాబు
అన్ని వ్యాఖ్యలు మీ కామెంట్ రాయండి
అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ బీసీ కమిషన్‌ సర్వే నివేదికను ఇవ్వకముందే.. ఫైనాన్స్ కమిషన్ బీసీ నివేదికను ఎలా రూపొందిస్తుందని ప్రశ్నించింది. తెలంగాణ గ్రామ పంచాయతీ రాజ్ యాక్ట్‌లో బీసీ జనాభా 34శాతమని.. శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులో 37శాతమని.. సకల జనుల సర్వే గణాంకాల్లో 54శాతం ఉందని.. వీటిలో ఏది నిజమని అడిగింది. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్‌ ప్రకారం బీసీ-ఏ, బీ, సీ రిజర్వేషన్ల ప్రక్రియ తేల్చాకే ఎన్నికలకు వెళ్లాలని ఏజీకి కోర్టు సూచించింది.

శ్రవణ్ తన పిటిషన్‌లో బీసీ ఓటర్ల గణాంకాలను తెలంగాణ ప్రభుత్వం తప్పుగా చూపిస్తోందని ఆరోపించారు. అసలు బీసీల ఓట్ల శాతం ఎంతో తేల్చేవరకు గ్రామపంచాయతీ ఎనికలకు నోటిఫికేషన్ ఇవ్వొద్దని కోరారు. 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారం బీసీ కమిషన్‌తో సర్వే నిర్వహించి.. అభ్యంతరాలను స్వీకరించాలే ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ప్రస్తావించారు. మరి ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో హైకోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లయ్యింది.

Comments

Popular posts from this blog

MTF - Charter Of Demands for Elections - 2019

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Muslim programme to confront the ‘Neo Manuism’