ICON, GREETING and Flag ( Proposal)


ICON, GREETING and Flag ( Proposal) 

ICON
భారత ముస్లిం సమాజపు ఆధునిక సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. వారు  అలిఘర్ లో 1817 అక్టోబర్ 17 న జన్మించారు, అప్పటి బ్రటీష్ వలస ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూనే వలస పాలిత ముస్లిం సమాజం కోసం, వారి అభివృద్ది కోసం అపార కృషి చేశారు.
బ్రిటీష్ ఇండియాలో ముస్లింలు అభివృధ్ధి చెందాలంటే ఇంగ్లీషు విద్య ఒక్కటే సాధనం అని  గుర్తించిన ఆలోచనాపరుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ . రాబోయే రోజుల్లో సమాజాన్ని విద్యావంతులే  శాసిస్తారు కనుక ముస్లింలు ఇంగ్లీష్, సైన్సు, మాథ్స్ ను తప్పకుండా చదవాలని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 19వ శతాబ్దంలోనే ప్రభోదించేవారు. ఇంగ్లీష్ లో పుస్తకాలు తెప్పించి వాటిని అనువాదింపజేశారు. సైన్సు సొసైటీని స్థాపించి విజ్ఞాన శాస్రాలను ప్రచారం చేశారు. 
          అప్పట్లో చాలా మంది ఆంగ్లాన్ని వలస పాలకుల భాష అని విమర్శించేవారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  అలాంటి విమర్శల్ని పట్టించుకునేవారుకాదు.  తనది ఆంగ్లం భాషా  వ్యామోహం కాదనీ,  వర్తమాన విజ్ఞాన శాస్త్రాలు ఆ భాషలోనే వున్నాయని వివరించావారు.  మదన మోహన మాలవ్య బెనారస్ హిందూ యూనివర్శిటీని  స్థాపించడానికి ముందే 1875లో సయ్యద్ అహ్మద్ ఖాన్ మొహమ్మడన్ ఆంగ్లో ఇన్ స్టిట్యూట్ ని స్థాపించారు. అదే ఆ తరువాతి కాలంలో  అలిఘర్ ముస్లిం యూనివర్సిటీ గా అభివృధ్ధి చెందింది. ఇంగ్లీషు పాలకుల్ని ఇంగ్లీషుతోనే జయించాలని గుర్తించిన తొలి భారతీయుడాయన. 
దళిత సంస్కర్త బీఆర్ అంబేడ్కర్ కూ,  ముస్లిం సంస్కర్త సయ్యద్ అహ్మద్ ఖాన్ కూ ఒక పోలిక వుంది. అణగారినవర్గాల విముక్తికి ఇంగ్లీషు విద్య ఉపయోగపడుతుందని ఇద్దరూ చాలా బలంగా భావించేవారు.
 సయ్యద్ అహ్మద్ ఖాన్ ను స్పూర్తిగా తీసుకుని ఏర్పడిన ముస్లిం ఆలోచనాపరుల వేదిక  (ఎంటిఎఫ్) ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసులు, బలహీనవర్గాలు, తదితర అణగారిన సమూహాల ఆత్మగౌరవం కోసం కృషిచేస్తుంది. జై భీం !  జై మీం !  మా నినాదం.  నీలం జెండా, ఆకుపచ్చ జెండా, ఎర్రజెండాలు కలిసి ఎగరాలనేది మా ఆశయం.  మతసామరస్యం మా లక్ష్యం


సయ్యద్ అహ్మద్ ఖాన్ తో పాటూ
1.     అష్ఫఖుల్లా ఖాన్
2.     మౌలాన అబుల్ కలాం ఆజాద్
3.     ఆగా ఖాన్ – 3
లను కూడా మన ఐకాన్ లా వాడవచ్చు.


పలకరింపు Greeting 

జై మీమ్ – జై భీమ్


మీమ్ అనేది ముస్లింకు సంక్షిప్త రూపం( Acronym)
ఉర్దూ, అరబ్బీ భాషల్లో ముస్లిం పదం మీమ్ అనే అక్షరంతో మొదలవుతుంది.

జై మీమ్ – అంటే ముస్లింలకు జయము కలుగుగాక అనే అర్ధం. 
మీమ్ ను  మైనార్టీలకు Acronymగా కూడా వాడవచ్చు.
అలాగే  మీమ్ ను  సందర్భాన్నిబట్టి ప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాక) గారికి  Acronymగా కూడా వాడవచ్చు.

భీం – అంటే భీం రావ్ అంబేడ్కర్.
జై భీం – అంటే భీం రావ్ అంబేడ్కర్ కు జయము కలుగుగాక అని అర్ధం.
ఇటీవల ఆదివాసులు కొమురం భీంకు జయము కలుగుగాక అని అర్ధంలో వాడుతున్నారు. రెండూ మనకు ఆమోదయోగ్యమే.


Flag (proposal)

మన జెండా మూడు రంగులది.

ఆకుపచ్చ, నీలం, ఎరుపు మూడు రంగులూ సమానం.

4 అడుగులు వెడల్పు 6 అడుగులు పొడవు.

భారత అణగారిన  సమూహాలకు అది చిహ్నం.


Comments

Popular posts from this blog

Ahmad Khan - French Revolution

Golden Era of Islam

Crusades - 1095–1291