మతసామరస్య సమాజాన్ని నెలకొల్పడానికి
మిత్రులారా!
నిన్న నేను పెట్టిన message లక్ష్యం ఈ రోజు మన Umar Farooq Khan పెట్టిన message వల్ల దారి మళ్ళింది.
Umar Farooq Khan గారు MTF లో చాలా చురుకైన నాయకులు. అయితే, వారు ఒక ఉద్వేగంలో, ఆతృతలో కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని మనం సహృదయంతో అర్ధం చేసుకోవాలి.
అధికారాల వికేంద్రీకరణలో భాగంగా సంస్థ ఆర్ధిక విభాగాన్ని Umar Farooq Khan గారికి అప్పచెప్పాము. ఆ క్రమంలో ఇప్పటి వరకు సంస్థకు ఆర్ధిక సహాయాన్ని అంద చేసిన వారి జాబితాను వారికి అప్ప చెప్పాము. వ్యక్తిగతంగా వాళ్ళకు ఫొన్ చేసి ఆర్ధిక సహాయాన్ని కోరాలనేది ప్రతిపాదన. అయితే ఆ జాబితాను వారు group లో పోస్ట్ చేయడంవల్ల చాలా ఇబ్బంది వచ్చింది. బకాయిదారుల జాబితాను ప్రకటించినట్టు అయింది. దీనికి నేను క్షమాపణలు చెపుతున్నాను.
ఒకరు చెప్పినా చెప్పక పోయినా తమంతట తాముగానే సంస్థ పనులు చేసుకుంటూ పోయేవాళ్ళు కనీసం ఓ పది మంది వున్నప్పుడే సంస్థ ముందుకు సాగుతుంది. మన సభ్యులు అలాలేరు. అదే నా అసంతృప్తి.
ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమంలో కూడా పాల్గోననివారు సహితం రోహింగ్యాలకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని సూచించడంతో కొంచెం అసహనానికి గురయ్యాను. గతంలోనూ ఒకసారి చెప్పాను ఎవరయినా ఏదైనా కొత్త ప్రతిపాదన చేస్తునపుడు అందులో తాము ఎలాంటి పాత్రను నిర్వహించగలరో కూడా చెప్పాలని. మనకు ఒకటే కొలమానం. చేయగలిగింది మాత్రమే చెప్పాలి. చెప్పింది తప్పనిసరిగా చేయాలి. పూర్తి చేసింది మాత్రమే ప్రచారం చేయాలి.
మిత్రులారా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఉద్యమాలకు పనిచేసేవాళ్ళే ప్రాణం. ఆర్ధికం అనేది ద్వితీయం మాత్రమే. . అనేక ఉద్యమాల్లో పనిచేసిన అనుభవంతో చెపుతున్నాను. పనిచేసేవాళ్ళుంటే అవసరమైన ఆర్ధిక వనరులు వాటికవే వస్తాయి. నేను కనీసపు ప్రయాణ వ్యయాన్ని మాత్రమే సంస్థ ఖాతా నుండి ఖర్చుపెడతాను. సాధారణంగా నా వసతి, భోజన ఏర్పాట్లు MTF యేతర స్థానిక మిత్రులే చూసుకుంటారు. సుదీర్ఘకాలం ఉద్యమాలలో పనిచేయడం వలన వచ్చిన సౌకర్యం ఇది.
ఒక్కోసారి ప్రయాణ ఖర్చులకు కూడా ఇబ్బంది వస్తున్నది. ముందు మనం వాటిని అధిగమించాలి. మన గ్రూపులో దాదాపు 70 మంది వున్నారు. వాళ్లంతా నెలకు కేవలం రెండు వందల రూపాయలు Contribute చేసినా వారానికి ఒక సభను క్రమం తప్పకుండా నిర్వహించగలం.
ఇది మన ప్రచార దశ మాత్రమే. మన సంస్థ పేరు పది మందికి తెలియపర్చడమే ఈ దశలో లక్ష్యం. ఆ తరువాత మనం మతసామరస్య సాధన కోసం ఒక నిర్మాణాన్ని చేపట్టాలి. అందులో అనేక ఇబ్బందులున్నాయి.
మనలక్ష్యం మతసామరస్యం, కమ్యూనిస్టుల లక్ష్యం వర్గరహితం, దళితులు బహుజనుల లక్ష్యం కులరహితం, స్త్రీవాదుల లక్ష్యం పితృస్వామిక వ్యవస్థ రద్దు, ఆదివాసుల లక్ష్యం సహజ వనరుల దోపిడీ రద్దు. వీళ్ళూగాక పెత్తందారీ కూలాల్లోని పేదవర్గాల్నీ, ప్రజాస్వామికవాదుల్నీ, ఉదారవాదుల్నీ, సామ్యవాదుల్నీ, సౌమ్యవాదుల్నీ, నాస్తికులు, హేతువాదుల్ని ఒక వేదిక మీదకి తీసుకు రావాలి. దానికి వీలయితే మనమే నాయకత్వం వహించాలి. వీలుకాకపోతే నాయకత్వ వర్గంలో అయినా వుండాలి. మతసామరస్య సమాజాన్ని నెలకొల్పడానికి ఇన్ని రకాల వ్యవస్థల్ని సమన్వయం చేయడం అంత సులువుకాదు. అయినా మనం దానికి సిధ్ధపడాలి. 2019 ఎన్నికల నాటికి మనం ఒక శక్తిగా ఎదగలేకపోతే ఇప్పుడు మనం చేస్తున్న పనులన్నీ వృధా అయిపోతాయి. అందుకే ఈ అసంతృప్తి, అసహనం.
ఇలాంటి దశలవారీ నిర్మాణానికి మనం మానసికంగా సిధ్ధం కావాలి. అలాంటి సంసిధ్ధత లేకపోతే ఈ పనిని ఇక్కడే ఆపేయడం మంచిది.
అభినందనలతో
- డానీ

Comments
Post a Comment