Bangalore Meet

మిత్రులారా!

గౌరీ లంకేష్ హత్యకు నిరసన తెలపడానికి  రాత్రి బయలుదేరి బెంగళూరు  వచ్చాను.  ఇక్కడి అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వామీజీలు   సంయుక్తంగా చాలా పెద్ద ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు.

ప్రదర్శనలో దాదాపు 20 వేల మంది పాల్గొన్నారు. బహుశ అంతకన్నా ఎక్కువ మంది  కావచ్చు. ఉదయం 10 గంటల నుండి అందరూ బెంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‍ దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుండి సిటీ సెంట్రల్ కాలేజీ వరకు నాలుగున్నర కిలో మీటర్ల  ప్రదర్శన సాగింది.  పన్నెండు గంటలకు సభ మొదలయింది. అది సాయంత్రం 7 గంటల వరకు సాగింది.

మనం ముందుగానే మన సంస్థ పేరును రిజిస్టార్ చేసుకుని ఒక గ్రూపుగా వెళ్ళివుంటే మనకూ మాట్లాడే అవకాశం వుండేది. సమాచారం లేక పోవడంవల్ల మనం ముందుగా  ఆ పని చేయలేదు. అసలు బెంగళూరు వెళ్ళాలనే నిర్ణయం కూడా చివరి క్షణంలో తీసుకున్నాము.

సంఘ్ పరివారానికి వ్యతిరేకంగా ఒక విశాల జాతీయ  వేదికను నిర్మించే ప్రయత్నాలు బెంగలూరు సభలో మొదలయ్యాయి. తీస్తా సెతల్వాద్, మేధాపాట్కర్, ఇర్ఫాన్ అలీ ఇంజినీర్, జిగ్నేష్ మేవాని,  పాలగుమ్మి సాయినాధ్, ఆనంద్ పట్వర్ధన్, నిజ గుణానందస్వామి, స్వామి అగ్నివేష్, సీతారాం ఏచూరి తదితరుల్ని ఆహ్వానించారు.

కర్ణాటకలో ముస్లింలు సామాజిక ఉద్యమాల్లో ఏపి/ తెలంగాణ కన్నా చాలా చురుగ్గా వున్నారు. ముస్లిం మహిళలకు కూడా ప్రత్యేక సంఘాలున్నాయి.

ఇక్కడ మరో సంఘం ముస్లిం చింతకార చావడి చురుగ్గా పని చేస్తున్నది. దీనికి తెలుగు అర్ధం మన సంఘమే. ముస్లిం ఆలోచనాపరుల వేదిక. దీని నాయకులు ప్రొఫెసర్ రెహమత్ కరికారే, పీర్ బాషా. నిన్నటి సభలో పీర్ బాషా మాట్లాడారు.  ప్రొఫెసర్ రెహమత్ కరికారే, దావణ గిరిలో వుంటారు. పీర్ బాషా హంపీలో వుంటారు. సభలో నిన్న వారు మాట్లాడగానే వెళ్ళిపోయారు. మనం తరువాత అయినా వాళ్ళలో సంబంధాలు పెట్టుకోవాలి.

ప్రొఫెసర్ రమజాన్ దర్గా ఇక్కడ మరో నాస్తిక నాయకులు. ఆయన బసవప్ప దారిలో వున్నారని విన్నాను.

ఇక్కడ కొంత మందినైనా వ్యక్తిగతంగా కలవాలనే వుద్దేశ్యంతో ఈరోజు బెంగళూరులో వుండిపోతున్నాను. విజన్  ఈరోజు -20, నేషనల్ వుమన్ ఫ్రంట్   నాయకులు అస్మా ఖాలిద్, ఫాతిమా తబస్సుమ్ లను కలుస్తాను.

మరిన్ని వివరాలు హైదరాబాద్ వచ్చాక తెలుపుతాను.

మీ
డానీ.

Comments

Popular posts from this blog

Crusades - 1095–1291

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Ahmad Khan - French Revolution