Bangalore Meet
మిత్రులారా! గౌరీ లంకేష్ హత్యకు నిరసన తెలపడానికి రాత్రి బయలుదేరి బెంగళూరు వచ్చాను. ఇక్కడి అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వామీజీలు సంయుక్తంగా చాలా పెద్ద ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. ప్రదర్శనలో దాదాపు 20 వేల మంది పాల్గొన్నారు. బహుశ అంతకన్నా ఎక్కువ మంది కావచ్చు. ఉదయం 10 గంటల నుండి అందరూ బెంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుండి సిటీ సెంట్రల్ కాలేజీ వరకు నాలుగున్నర కిలో మీటర్ల ప్రదర్శన సాగింది. పన్నెండు గంటలకు సభ మొదలయింది. అది సాయంత్రం 7 గంటల వరకు సాగింది. మనం ముందుగానే మన సంస్థ పేరును రిజిస్టార్ చేసుకుని ఒక గ్రూపుగా వెళ్ళివుంటే మనకూ మాట్లాడే అవకాశం వుండేది. సమాచారం లేక పోవడంవల్ల మనం ముందుగా ఆ పని చేయలేదు. అసలు బెంగళూరు వెళ్ళాలనే నిర్ణయం కూడా చివరి క్షణంలో తీసుకున్నాము. సంఘ్ పరివారానికి వ్యతిరేకంగా ఒక విశాల జాతీయ వేదికను నిర్మించే ప్రయత్నాలు బెంగలూరు సభలో మొదలయ్యాయి. తీస్తా సెతల్వాద్, మేధాపాట్కర్, ఇర్ఫాన్ అలీ ఇంజినీర్, జిగ్నేష్ మేవాని, పాలగుమ్మి సాయినాధ్, ఆనంద్ పట్వర్ధన్, నిజ గ...