Muslim Thinkers Forum Manifesto


Thinkers Forum Manifesto

మిత్రులారా!
మన వేదిక ప్రణాళికను ప్రవేశపెడుతున్నాను. దీని మీద మీ అభిప్రాయాలు చెప్పగలరు. దాన్నిబట్టి అంతిమ నిర్ణయం తీసుకుందాం.

ఒక నిర్ణయం తీసుకునే వరకు  మార్పులు చేర్పులకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే వుంటాయి. ఒకసారి సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక ఆ దశకు సంబంధించి మార్పులు వుండవు.

- డానీ
7.40 a.m.
4 July 2017
చరిత్రలో ఈ రోజంటే నాకు చాలా ఇష్టం.

ముస్లిం ఆలోచనాపరుల వేదిక
ప్రణాళిక
4- జులై- 2017

వేదిక పేరు తెలుగులో
ముస్లిం ఆలోచనాపరుల వేదిక

వేదిక పేరు ఇంగ్లీషులో
 Muslim Thinkers Forum

నిర్వచనాలు- పరిధీ పరిమితీ

ముస్లిం
ఇస్లాం మీద విశ్వాసం, ముస్లీం సంస్కృతీ సాంప్రదాయాల మీదా గౌరవభావం గల ముస్లిం సామాజికవర్గం.

ఆలోచనాపరులు
కవులు, కళాకారులు, రచయితలు, సాహిత్యవిమర్శకులు, పరిశోధకులు, పాత్రికేయులు, సంఘసేవకులు,ఉపన్యాసకులు, విద్యావేత్తలు.  

వేదిక కార్యక్షేత్రం
రెండు తెలుగు రాష్ట్రాలు.

నిర్మాణం
రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒక కన్వీనర్ వుంటారు. వీరినే సాంకేతికంగా  జాతీయ కన్వీనర్ అనవచ్చు.
రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో  కన్వీనర్,  కో కన్వీనర్లు,  ఒక కోశాధికారి వుంటారు.
జిల్లా స్థాయిలో కన్వీనర్లు,  కో కన్వీనర్లు,  ఒక కోశాధికారి వుంటారు. 
నగర, మండల / పట్టణ స్థాయిల్లో కన్వీనర్లు, కో కన్వీనర్లు,  వుంటారు.
మండల / పట్టణకన్వీనర్లు జిల్లా కమిటీలో కో-కన్వీనర్లుగా వుంటారు.
జిల్లాల  కన్వీనర్లు రాష్ట్ర  కమిటీలో కో-కన్వీనర్లుగా వుంటారు.
రెండు రాష్ట్రాల కన్వీనర్లతోపాటూ  రెండు రాష్ట్రాల నుండి చెరో ముగ్గుగురు జాతీయ కో-కన్వీనర్లుగా వుంటారు.

స్వభావం
ఇది మత అల్పసంఖ్యాకుల వాదాన్ని, భావోద్వేగాలనీ ప్రచారం  చేసే ప్రజాస్వామిక వేదిక.  
ముస్లిం సమాజపు సమస్యల్ని సంవాదం ద్వార  పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. 
ఉగ్రవాదాన్ని, మతతత్త్వవాదాన్నీ అన్ని రూపాల్లోనూ వ్యతిరేకిస్తుంది.

కార్యక్రమం
1. రచనలు, ప్రదర్శనలు, ఉపన్యాసాలు, ప్రచురణల ద్వార భావ ప్రచారం, సంవాదం సాగించడం. 
2. స్వీయ సమాజంలోని బాధితులకు నైతిక మద్దతు ఇవ్వడం.
3. సాటి అణగారినవర్గాలకు సంఘీభావాన్ని తెలపడం.


చారిత్రక సందర్భం
దేశంలో ఒక అసహన వాతావరణం కమ్ముకుని మతమైనారిటీలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కాలంలో- .
హిందూత్త్వ ఉగ్రవాదం  గోగ్రవాదం రూపందాల్చి విచారణ, నిరూపణ, న్యాయప్రక్రియలు లేకుండానే తప్పుడు ఆరోపణలతో ముస్లీంలను ఎక్కడికక్కడ చంపేస్తున్న కాలంలో-
సహజ వనరుల నుండీ, సామాజిక వ్యవస్థల నుండీ ముస్లీంలను గెంటేస్తున్న కాలంలో -
ఇస్లామోఫోబియాతో ముస్లీంల అస్థిత్త్వం, సంస్కృతుల మీద  అమానుష దాడులు జరుపుతున్న కాలంలో  -
ప్రభుత్వ చేయుత, సౌకర్యాలు, రాయితీలు  తగ్గిపోవడమేగాక  జీవికను కాపాడుకోవడమే ముస్లింలకు నిరంతర సమస్యగా మారిపోయిన కాలంలో -
ముస్లింల ఆత్మఘోషను సాటి మనుషులకు ఇతర సమాజాలకు, సమూహాలకు వివరించి ఆత్మరక్షణ పొందడానికి ఆవిర్భవించింది ముస్లిం ఆలోచనాపరుల వేదిక.


లక్ష్యాలు
1.     రాజకీయ, ఆర్దిక, విద్యా, ఉపాధి, సాంస్కృతిక రంగాల్లో ముస్లింల అభ్యున్నతి కోసం కృషిచేయడం తక్షణ లక్ష్యం.
2. స్వీయ అస్థిత్త్వాన్ని కాపాడుకుంటూనే ఆధునిక సమాజ అవసరాలకు  అనుగుణంగా  తీవ్ర అడ్దంకిగా వున్న అంశాల్లో సవరణలు ప్రతిపాదించడం  స్వీయసమాజ సంస్కరణ లక్ష్యం.
3.   దేశంలో ఒక మతసామరస్య సమాజాన్ని నిర్మించడం అంతిమ లక్ష్యం.
    
ప్రధాన నినాదం
మతసామరస్యం వర్ధిల్లాలి ! 


సంఘీభావం
1.   ఆదివాసులు, దళితులు, శ్రామిక కులాలు, శ్రామికులతో మాత్రమేగాక హిందూ సమాజపు ప్రాబల్య కులాలలోని పేదలతోసహా సమస్త అణగారిన సమూహాలతో సంఘీభావంతో మెలగడం.
2.   జనాభా దామాషా  ప్రకారం అందరికీ అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం (నూటికి నూరు శాతం రిజర్వేషన్) కోసం అందర్నీ కలుపుకొని ఉద్యమించడం.
3.   లౌకిక, ప్రజాస్వామిక, ఉదారవాద, సామ్యవాద, పౌరహక్కుల, మానవహక్కుల నేతలు, సంస్థలు, వేదికలతో కలిసి పనిచేయడం.

కార్యక్షేత్రం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు



సభ్యత్వం
1. మతాచరణవున్న ముస్లింలతోపాటూ మతాచరణ లేని ముస్లీంలు కూడా యంటీఎఫ్ ప్రణాళికను ఆమోదించి  సభ్యులుగా చేరవచ్చు.

2. ప్రజాస్వామిక పధ్ధతుల్లో నడిచే ఇతర  ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలలో సభ్యులుగా వున్నవారు సహితం అక్కడి సభ్యత్వాలను రద్దు చేసుకోకుండానే యంటీఎఫ్ ప్రణాళికను ఆమోదించి సభ్యులుగా చేరవచ్చు. తాము ఏ రాజకీయ పార్టీలో, సంస్థల్లో సభ్యులుగా వున్నారో వున్నారో ముందుగా తెలియపరచాలి. వాళ్ళు MTF  సభ్యులుగా చేరిన తరువాత కూడా పాత సంస్థలు, పార్టీల్లో  కొనసావచ్చు. వాటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనవచ్చు. అయితే, తమ టౌన్లు, జిల్లాల్లో MTF  కార్యక్రమాల్ని విడిగా నిర్వహించాలి. ఇతర సంస్థలలో కలిసి సంయుక్తంగా కార్యక్రమాలు  నిర్వహించాలనుకున్నప్పుడు ముందుగా రాష్ట్ర నాయకత్వం అనుమతి తీసుకోవాలి. 

3. సభ్యులు కాదలచినవారు తమకు ఏఏ సంస్థల్లో సభ్యత్వాలున్నాయో, 
a. ఏఏ విభాగాల్లో ఆసక్తి, నైపుణ్యాలు వున్నాయో. 
b. తాము వేదిక కోసం రోజుకు ఎంత సమయం కేటాయించగలరో
c. ఏఏ పనులు చేయగలరో 
d. నెలకు ఎంత ఆర్ధిక సహాయాన్ని అందించగలరో
స్పష్టంగా పేర్కోవాలి. 
4. MTF సభ్యుల 10 కర్తవ్యాలు 
1. సమాజంలో మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా రచనలు/ ప్రచారం / ప్రదర్శనలు చేయాలి.
2. సంస్థ కోసం కొంచెం శారీరక  శ్రమ చేయడానికి సిధ్ధపడాలి. 
3. సంస్థ కోసం ప్రతిరోజూ కనీసం ఒక గంట సమయం కేటాయించాలి.
4. మతసామరస్యాన్ని పెంపొందించడానికీ, ముస్లీంల అభ్యున్నతికి తోడ్పడడానికీ, ముస్లీం వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడానికీ ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టుపెట్టాలి. MTF తో భావసారూప్యం వున్న పోస్టుల్ని SHARE  చేయడం కూడా ప్రచారంలో భాగమే  
5. హాలు మీటింగులు - సభలు, సమావేశాలు, అవగాహన తరగతులు, శిక్షణా తరగతులు  నిర్వహించడానికి చొరవ చూపాలి.  
6. MTF ఇతర యూనిట్లు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనాలి.  
7. MTF తో భావసారూప్యం కలిగిన ఇతర సోదర  సమూహాలు సంస్థలతో కలిసి పనిచేయాలి. 
8. అణగారిన సమూహాల మీద దాడులు జరిగినపుడు బాధితుల్ని పలకరించి నైతిక మద్దతు ఇవ్వాలి. 
9. సంస్థ నిర్వహణకు నెలవారీ చందాను తమ శక్తి మేరకు ఇవ్వాలి.
10. బహిరంగ కార్యక్రమాలు -  ధర్నాలు, ఊరేగింపులు, పాదయాత్రలు కార్యక్రమాలను నిర్వహించాలి. 
(నోట్ : MTF  లో  సంస్థలు, రాజకీయ పార్టీల్లోనూ 

వీటిల్లో మీరు మొత్తం  10 పనులూ చేయలేక పోవచ్చు. కనీసం 5 పనులయినా చేయాలి.  ఏ 5 పనులు చేస్తారో నిర్దిష్టంగా ప్రకటించాలి. ప్రకటించినవి చేసి తీరాలి. 

అంత శక్తి లేనపుడు గౌరవప్రదంగా  గ్రూపు నుండి తప్పు కోవాలి. 
5.



సభ్యత్వ నిరాకరణ
ఇస్లాం మీద, ముస్లీం సంస్కృతీ మీద గౌరవభావంలేని ముస్లీంలు, మతతత్త్వ భావాలు కలిగినవారు MTF  సభ్యత్వానికి  అనర్హులు.

సభ్యత్వ రుసుము
సంవత్సరానికి వంద రూపాయలు.

ఆర్ధిక వనరులు
సభ్యులు, అభిమానులు, మిత్రులు, స్థితిమంతులు, సానుభూతిపరులు,  స్వఛ్ఛంద సేవాసంస్థల నుండి విరాళాలు సేకరించడం.

విధాన నిర్ణయాలు
1.   అత్యున్నత విధాన నిర్ణయ సభ సర్వసభ్య సమావేశం. ఏ విషయంలో అయినా సర్వసభ్య సమావేశానిదే అంతిమ నిర్ణయం.
2.   ఏడాదికి కనీసం ఒకసారి సర్వసభ్య సమావేశం జరుగుతుంది.
3.   రెండేళ్లకు ఒకసారి అన్ని స్థాయిల్లోనూ కొత్త కార్యవర్గాల్ని ఎన్నుకోవాలి.
4.    సర్వసభ్య సమావేశాల మధ్య కాలంలో  అత్యవసర అంశాల మీద తాత్కాలిక నిర్ణయం తీసుకునే అధికారం సంస్థ కార్యవర్గానికి వుంటుంది.
5.   సంస్థ ప్రకటిత లక్ష్యాలకు విరుధ్ధంగానూ, సంస్థకు అప్రతిష్టతెచ్చే విధంగానూ ప్రవర్తించే సభ్యుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే తాత్కాలిక అధికారం సంస్థ కార్యవర్గానికి వుంటుంది.
6.   సంస్థ కార్యవర్గం తీసుకునే నిర్ణయాలన్నింటీనీ తదుపరి సర్వసభ్యసమావేశం ఆమోదించినపుడే వాటి పూర్తి స్థాయి అమలు జరుగుతుంది.
7.   వేదిక విస్తరణ కోసం అవసరమైనపుడు కొత్త  కార్యవర్గసభ్యుల్ని నియమించే అధికారం సంస్థ కన్వీనర్ కు వుంటుంది.
8.   అలా నియమితులైన కార్యవర్గసభ్యులు  తదుపరి సర్వసభ్య సమావేశం ఆమోదాన్ని పొందాల్సి వుంటుంది.

ప్రణాళికకు సవరణలు
మూడింట రెండు వంతుల మెజారిటీతో ప్రణాళికలోని అంశాలను సవరణ చేసే అధికారం సర్వసభ్యసమావేశానికి వుంటుంది.


కార్యవర్గ నిర్ణయాలకు కోరం
కన్వీనర్ మరియూ కో-కన్వీనర్లలో కనీసం సగం మంది సభ్యులు వుండాలి.


సంస్థాగత అంతర్గత ప్రజాస్వామ్యం 
ఒక నిర్ణయం తీసుకునే వరకు  మార్పులు చేర్పులకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే వుంటాయి. సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకున్నాక ఇక ఆ దశకు సంబంధించి మార్పులు వుండవు.

అత్యవసర కార్యవర్గ నిర్ణయాలకు కోరం
కన్వీనర్ మరియూ కో-కన్వీనర్లలో కనీసం ఇద్దరు  సభ్యులు వుండాలి. 

కార్యవర్గం (4 జులై 2017) 
విస్తరణ (30 -09-2017
1. కన్వీనర్ -  ఏయం ఖాన్ యజ్దానీ (డానీ)-, హైదరాబాద్ 
2. కో-కన్వీనర్ - అబ్దుల్ వాహెద్-  హైదరాబాద్ 
3. కో-కన్వీనర్ -  జుబేదా హుస్సేన్ – వరంగల్
4. కో-కన్వీనర్ -  అన్వర్ – వరంగల్
5. కో-కన్వీనర్ - గఫూర్ శిక్షక్ , కామారెడ్డి
6. కో-కన్వీనర్ - నబీ కరీం ఖాన్, ఒంగోలు
7. కో-కన్వీనర్ - జహా ఆరా, విశాఖపట్నం
8. కో-కన్వీనర్ -  ఫయాజ్ అలీ, సత్తుపల్లి
9. కో-కన్వీనర్ - నశ్రీన్ ఖాన్ – హైదరాబాద్ 
10. కో-కన్వీనర్  - షరీఫ్ వేంపల్లి  – విజయవాడ 
11. కో-కన్వీనర్  - ఉమర్ ఫారూఖ్ ఖాన్ – హిందూపూర్ 
12. కో-కన్వీనర్  - హసన్ షరీఫ్   – కాకినాడ 

Contributers 
As on 31 May 2018
In Alphabetical order 

1. A M Khan Yazdani (Danny) 
2. Abdul Wahed
3. Asifuddin Ahmad
4. Haneef Hohammad Shaik
5. Hasan Sharief
6. Jaha Ara 
7. Khalida Parveen
8. Mazhar Rehaman
9. Mohammed Abdulkhadar
10. SNM Anwar 
11. Umar Farooq Khan 
12. Vempalle Sharief




XXXXXXXXX

Wahed 18-11-2017 
1. ముస్లిం థింకర్స్ ఫోరమ్ కేవలం ముస్లిం సముదాయం రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే సంస్థ.
2. ముస్లిమ్ థింకర్స్ ఫోరమ్ ఇస్లామీయ ధార్మిక విశ్వాసాలకు వ్యతిరేకం కాదు. కాని ఫోరమ్ ధార్మిక చర్చలకు వేదిక కాదు.
3. ఫోరములో సాంస్కృతిక అంశాల ప్రస్తావనకు అభ్యంతరం లేదు. అంటే, సలామ్ చెప్పడం, పండగల సందర్భంగా ముబారక్ వగైరాలు 
4. వ్యక్తిగతంగా ఎవరి ధార్మకి పంథా ఏది అయినా, ఎవరి సిద్ధాంతం ఏదయినా ఫోరమ్ కు సంబంధం లేదు. ఒకరి వ్యక్తిగత ధార్మిక లేదా విశ్వాసపరమైన లేదా విశ్వాసవిరుద్దమైన వైఖరి, నమ్మకం, ధోరణి వ్యక్తిగతమే. ఫోరమ్ కు సంబంధం లేదు. అలాంటి విషయాల ప్రస్తావనకు ఫోరమ్ లో అవకాశం లేదు. 
5. ముస్లిమ్ అంటే ఇస్లామును విశ్వసించేవాడన్న సూత్రమే ముస్లిమ్ సముదాయం ఎవరన్న నిర్వచనం. ఎవరైనా స్పష్టంగా, బహిరంగంగా తాను ముస్లిమ్ కాదని ప్రకటిస్తే తప్ప,  వ్యక్తిగత ఆచరణలతో ఫోరమ్ కు సంబంధం లేదు. .

మిత్రులారా! MTF అనేది ఉబుసుపోక కబుర్ల చట్టబండకాదు. బూటకపు ప్రకటనల సంస్థ కూడా కాదు. 



MTF సభ్యులకు నాలుగు కర్తవ్యాలు
1. నైపుణ్యం 
2. సమయం 
3. శ్రమ   
4. వనరులు
MTF సభ్యులందరూ ఈ నాలుగు కర్తవ్యాలను నిర్వర్తించడానికి కృషిచేయాలి. వీటిల్లో కనీసం ఓ రెండు కర్తవ్యాలను నిర్వర్తించేవాళ్లను క్రియాశీల సభ్యులుగా భావించాలి. ఏదో ఒక కర్తవ్యాన్ని నిర్వర్తించేవారిని సాధారణ సభ్యులుగా పరిగణించాలి. ఒక ఏడాది కాలంలో ఒక్క కర్తవ్యాన్ని కూడా  నిర్వర్తించని వారిని సభ్యత్వం నుండి తొలగించాలి.


I request the non-serious people to leave the group.
కమ్యూనిస్టులు 


10-03-2018

మిత్రులారా ! 
మనం గతంలో 'ముస్లిం రిజర్వేషన్లు' అంశం మీద కొన్ని సదస్సులు నిర్వహించాం. ఆ తరువాత  "ముస్లింల మీద దాడుల్ని  ఖండించండి' అంటూ ఆరేడు సదస్సులు నిర్వహించాము. ఇప్పుడు 'ముస్లిం ఆత్మగౌరవ సభలు' పేరుతో కొత్త క్యాంపేయిన్ నడుపుదాం. ఇది విశాఖపట్నం నుండే మొదలవుతుంది. 

ఇందులో మూలవాసుల్ని కూడా కలపాలని కొందరు మిత్రులు సూచించారు. నిజమే ఐక్య సంఘటన లేకుండా మనం ఏమీ సాధించలేం. మన సభల్లో సంఘీభావం తెలపడానికి ST, SC, హిందూ BC లనేకాక హిందూ OC లనూ, లౌకిక, ప్రజాసామ్య, పౌరహక్కుల, మానవ హక్కుల, ఉదారవాద, సామ్యవాదుల్ని సహితం  తప్పక పిలవాలి. 

MTF నిర్వహించే సభల థీమ్ మాత్రం   'ముస్లిం ఆత్మగౌరవ సభలు'  అనే వుంటుంది. 

మనం భవిష్యత్తులో కలిసి వచ్చే ఇతర అణగారిన  సంఘాలతో ఐక్యంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము. అప్పుడు అప్పటి సభ్యసంఘాల  సూచనల మేరకు  ఉమ్మడి నినాదాన్ని రూపొందిస్తాము. స్వంత నినాదం లేకుండా ఉమ్మడి నినాదం వుండదు. అది నిరంతరం గుర్తు పెట్టుకోండి. 

విశాఖపట్నం సభలు మనకు చాలా ముఖ్యం. మార్చి 27 - 31 మధ్య కాలంలో ఈ సభ జరిగితే బాగుంటుంది.  ఈ నెలలో 10, 11, 17, 18, 24, 25 తేదీలను నేను ఇతర సంస్థలకు కేటాయించాను. అయినప్పటికీ జహ ఆరా గారు కోరితే విశాఖ సభ కోసం వాటిల్లో కొన్నింటిని రద్దు చేసుకుంటాను. 

మన సభ్యుల్లో అత్యధికులు గ్రూపులో తప్ప ఇతర విభాగాల్లో  ముస్లిం అస్తిత్వాన్ని వ్యక్తం చేయడంలేదు.  ప్రతి ఒక్కరూ విశాఖ సభకు రావడానికి ఏర్పాట్లు చేసుకోండి.

జై మీమ్ 

- డానీ 


10-03 2018
మిత్రులారా ! 
@Jaha Ara గారు విజయవాడ బడ్జెట్ సదస్సు నివేదిక చివర్లో "Pathetic, I Don't know when when our muslim community include women folk in main stream" అంటూ ఒక ఆవేదనను వ్యక్తం చేశారు. 

ముస్లీం సమాజంలోనేకాదు ఇతర సమాజాల్లోనూ ఇప్పటికీ పురుషాధిపత్యమే కొనసాగుతోంది. అయితే ఈ నిందకు MTF  తగదు. 

స్కైబాబ బయటికి వెళ్ళిపోయినపుడు  మన గ్రూపుకు వచ్చే ఇబ్బందీ ఏమీ వుండదని  నాకు తెలుసు. బయటికి వెళ్ళి అతను చేయగలిగిందీ ఏమీ వుండదనీ నాకు తెలుసు. దీనికి కారణం ఒక్కటే అతను వ్యక్తివాది. మనం సమిష్టివాదులం. వ్యక్తివాదులు ఏ సంస్థలోనూ ఇమడలేరు. 

అయితే స్కైబాబతో పాటు షాజహానా వెళ్ళిపోవడం నాకు కొంచెం బాధను కలిగించింది. Woman face of Muslim community మనకు లేకపోవడం పెద్ద లోటు అనిపించింది.  ఈ లోటును తీర్చడానికేగాక అధిగమించడానికి అప్పట్లో నేను కొన్ని రోజుల పాటు  పెద్ద కసరత్తు చేశాను. సశ్రీన్ ఖాన్ ను కో-కన్వీనర్ గా ప్రకటించాము. MTF  కో-కన్వీనర్ గా వుండమని వుడుగుల జరీన, రెహానా బేగంలతో  కొన్ని రోజులు చర్చించాను. వాళ్ళు దానికి సిధ్ధంగా లేమన్నారు. జుబేదా హుస్సైన్ గారిని నేను ఇప్పటి వరకు చూడనే లేదు. మిత్రులు వారి గురించి చెపితే , వారితో మాట్లాడి కో-కన్వీనర్ గా ప్రకటించాము. 

Jaha Ara గారు మనకున్న గొప్ప మహిళా ప్రతినిధి. మంచి వక్త మాత్రమేగాక వారికి న్యాయశాస్త్రంలో మంచి పట్టువుంది.  'రాజ్యాంగం - ముస్లింల హక్కులు - రిజర్వేషన్లు' అనే అంశం మీద వారితో ఒక అధ్యయన తరగతి నిర్వహించాలను కూడా అనుకున్నాము. 

మనం త్వరలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు విడిగా రాష్ట్ర సభలు నిర్వహించి కొత్త కార్యవర్గాలను ఎన్నుకుంటాము. రెండు రాష్ట్ర కమిటీల్లోనూ అధ్యక్ష, కార్యదర్శి పదవుల్లో ఒకరు తప్పకుండా మహిళా ప్రతినిధి వుండేలా నిబంధనలు పెట్టుకుందాం.

ముస్లిం మహిళలు మైనారిటీల్లో మైనారిటీలు. MTF దానికి భిన్నంగా వుండాలనేది నా అభిప్రాయం. 

ఈ అంశాల మీద సభ్యులు తమ అభిప్రాయాలని తెలపగలరు. 

జై మీమ్ 

- డానీ 

14-03-2018
@ Asifuddin గారూ! 
MTF ఆరంభిస్తున్నపుడు మన icon  గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. ఒక విశాల దృక్పధంతో గమనిస్తే ప్రవక్త  ముహమ్మద్ (pbuh) గారే ఒక గొప్ప సంస్కర్త. ఆ విషయంలో ఏ ముస్లింకు కూడా ఎలాంటి సందేహాలు లేవు.  
కొన్ని దళిత సంఘాలు గౌతమ బుధ్దుడ్ని కుడా icon గా ప్రచారం చేస్తున్నాయి. ఆదివాసులు  నాగోబా దేవతను icon గా ప్రచారం  చేస్తున్నారు. ఇంకొకరు రేపు మరో దేవతను ముందుకు తేవచ్చు. అంచేత ఆ చర్చను అక్కడ ఆపేశాము. 
 ఆధునిక కాలానికి సంబంధించి సయ్యద్  అహ్మద్ ఖాన్, అబుల్ కలామ్ ఆజాద్ ల విషయంలో చర్చ జరిగింది. ఆజాద్ గారి మీద కాంగ్రెస్ ముద్రవుంది.  జాతియోద్యమ కాలంలో  వ్యక్తిగతంగా నాకు ముహమ్మద్ ఆలీ జిన్నా చాలా ఉత్తేజపూరిత నాయకుడు. ఆయన మీద పాకిస్తాన్ ఏర్పాటు ముద్ర వుంది. సయ్యద్  అహ్మద్ ఖాన్ రాజకీయాలకు దూరంగా వున్నారు. విద్యా, సామాజిక రంగాల్లో సంస్కరణలకే పరిమితం అయ్యారు. అలా వారిని MTF icon గా ఎంపిక చేశాము. 
ఇటీవల దళిత ఆలోచనాపరులు కొందరు మూడవ ఆగా ఖాన్ ను అధ్యయనం చేస్తున్నారు. మొదటి రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఆగా ఖాన్, అంబేడ్కర్, శిక్కు ప్రతినిధులు చాలా సన్నిహితంగా మెలిగారు.  భారత అణగారినవర్గాల గురించి చాలా విస్తృతంగా చర్చించారు. మూడవ రౌండ్ టేబుల్ సమావేశాల్లో  జిన్నా ప్రవేశించారు. ఇప్పుడు కొందరు దళిత ఆలోచనాపరుల ఛాయిస్ మూడవ ఆగా ఖాన్ గా వుంది.  అయితే, మన నిర్ణయమే మనది.   
ఎప్పుడయినా సరే ఒకటే కొలమానం. మనం ఏం చేయాలో మనమే నిర్ణయించుకోవాలి. దాన్ని సాధించడం కోసం  ఇతరులతో జట్టు కట్టాలి. 
icons ను పెంచుకుంటూ పోవడంవల్ల కుడా ఒక ఇబ్బంది వుంది.    బహుజన సంఘాల కరపత్రాల్లో ఇటీవల దాదాపు పది icons  వుంటున్నాయి.  ఫూలే, సావిత్రీబాయి, సాహు మహరాజ్, జగ్జీవన్ రామ్, కాన్షీరామ్  ...... ఇలా సాగుతోంది ఆ జాబితా. 
జిన్నా సహితం ఆ కాలంలో పెరియార్ రామసామి నాయకర్, ఆంబేడ్కర్ లతో సన్నిహితంగా వున్నారు. ఆ వివరాలను మనం ఈ రోజు అధ్యయనం చేయాల్సి వుంది.
నా వ్యక్తిగత అభిప్రాయం అప్పుడూ, ఇప్పుడూ కూడా MTF   icon  గా    సయ్యద్  అహ్మద్ ఖాన్  గారినే కొనసాగించాలనేది.   ఇది మేనిఫెస్టో కు సంబంధించిన అంశం కనుక   అందులో మార్పు వుండదు.  భవిష్యత్తులో మహాసభల్లో   ఎవరయినా మూడింట రెండు వంతుల ఆధిక్యతతో ఈ అంశం మీద చర్చ చేసి గెలిస్తే అది వేరే విషయం. 
సభ్యులు ప్రతి సందర్భంలోనూ  జై మీమ్ !  అంటూ అభివాదం చేయడం అలవర్చుకోండి. మీమ్   అంటే ముస్లిం, మైనారిటీ అని మనం అంటున్నాం.  అభిమానంతో ముహమ్మద్ (pbuh) అని కూడా విస్తృత అర్ధం చెప్పుకోవచ్చు. 
మూడు పదాలూ  'మీమ్' లేదా 'M' అనే అక్షరంతో మొదలవుతాయి. మీమ్ అంటే మొదట్లో  ముస్లీం అనే అర్ధం మాత్రమే వుంది. మనవాళ్ళే బహుశ హనీఫ్ అనుకుంటాను మైనారిటీ, ముహమ్మద్ అని extention  ఇచ్చారు.  ఎవరికయినా  ముహమ్మద్ వద్దు అనుకుంటే మానుకోవచ్చు. 
జై మీమ్ ! 
- డానీ 

14-03-2018
మిత్రులారా! 
కొందరు మిత్రులు నేను groupలో మేధో చర్చను అడ్దుకుంటున్నాననే అర్ధంలో మాట్లాడుతున్నారు. అది నిజం కాదు. చర్చను నేను నిరంతరం ఆహ్వానిస్తాను.  మన గ్రూపులో సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాల మీద నిరంతరం చర్చ సాగాలి. అయితే, ' నమాజ్ సాంప్రదాయాలు ఎన్నీ?  వాటిల్లో ఉత్తమమైనది ఏది ?" వంటి కేవల - ఆధ్యాత్మిక అంశాల చర్చకు ఇది వేదిక కానేకాదు. 
నేను ఇంకో విషయాన్నీ గమనిస్తున్నాను. మన గ్రూపులో ఆధ్యాత్మిక అంశాలను ప్రస్తావిస్తున్నవాళ్ళకు  సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాల మీద ఆసక్తి లేదు.  ఎవరయినా  ఆధ్యాత్మిక అంశాలను ప్రస్తావించినపుడు నేను వాళ్ల FB Wall లోనికి వెళ్ళి వర్తమాన సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాల మీద ముస్లీం దృక్పధం నుండి వాళ్ళు ఎలాంటి postings  పెడుతున్నారో గమనిస్తాను. వాళ్ల postings లో వాటి ప్రస్తావనే వుండదు. ఇలాంటివాళ్లు మనకు వద్దు. నిర్మొహమాటంగా వద్దు. 
ఇలా నేను అన్నప్పుడు నన్ను నాస్తికునిగా చిత్రించడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు.  నిజానికి వీళ్లకు సరైన వేదిక మీద ఇస్లాం ఘనతను చెప్పేంత సామర్ధ్యం కూడా లేదు. గత వేసవిలో వేంపల్లె షరీఫ్ 'టోపీ జబ్బార్" పుస్తకావిష్కరణ సందర్భం  విజయవాడలో సంఘసంస్కర్తల మీద చాలా వేడి వేడి చర్చ సాగింది.
"రాజా రామ్మోహన రాయ్, కందుకూరి వేరేశలింగం, గురజాడ అప్పారావులను సంఘసంస్కర్తులుగా పేర్కొంటూ మనకు పాఠ్యాంశాలున్నాయి. వీళ్లంతా 20వ శతాబ్దానికి చెందినవారు.  'విధవా స్త్రీ పునర్ వివాహం, మహిళలకు ఆస్తిహక్కు,  స్వేచ్చాయుత పెళ్ళి హక్కు,  విడాకుల హక్కుల గురించి వీళ్లకన్నా 14 వందల సంవత్సరాల క్రితమే ఓ గొప్ప సంస్కర్త ప్రవచించారు. ఆచరించారు. తన అనుచరుల్ని ఆచరించమన్నారు.  వారిని సంఘసంస్కర్తగా పేర్కొంటూ మన స్కూలు పుస్తకాల్లో పాఠం ఎందుకు లేదు? ఇది చరిత్రను వక్రీకరించడంకాదా? "  అని ప్రశించాను. నన్ను నమ్మండి ఒక్కరంటే ఒక్కరూ నన్ను ఖండించలేదు.  "ఆధ్యాత్మికం ప్రధానం" అనే మన మిత్రులకు ఈ స్తోమత లేదు. ముస్లింలకే వీళ్ళు ఇస్లాంను బోధించాలనుకుంటారు!    అసలు విషయం ఏమంటే వీళ్లకు ఆధ్యాత్మిక విషయాలను  సహితం సమర్ధంగా రాయడం రాదు.  అనుమానం వున్నవాళ్ళు  " ఇత్తెహద్   (ఐక్యత  )    ఎలా    సాధ్యం  ?    నేడు    అందరూ   వేసే   ప్రశ్న  ? "  అని మార్చి 10న పోస్ట్ చేసిన ఖిజర్  ఖాన్ వ్యాసం చదవండి. 
కేవల – అధ్యాత్మికవాదుల్ని పక్కన పెట్టి,  వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపిని గద్ది దించే మార్గాలేమున్నాయి అనే అంశం మీద మిత్రులు నిరంతరం చర్చించండి.  
జై మీమ్ ! 
- డానీ

ముస్లింలు అంటే ఇస్లాం మీద విశ్వాసం, ముస్లీం సంస్కృతీ సాంప్రదాయాల మీదా గౌరవభావంగల  సామాజికవర్గం.  అయితే, ఈ వేదిక ధార్మిక సంస్థ కాదని రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక  రంగాల్లో   ముస్లిం సమాజపు అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రజాసంఘం అని మనం నిరంతరం గుర్తుంచుకోవాలి. 

మతప్రచారకుల్ని, ధార్మికచర్చలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ  ఈ గ్రూపులో చేర్చవద్దు.  ఇది దునియాదారీ వేదికేగానీ దీన్ దారీ వేదిక కాదని స్పష్టం చేయండి. 

కవులు, కళాకారులు, రచయితలు, సాహిత్యవిమర్శకులు,  పరిశోధకులు, పాత్రికేయులు, సంఘసేవకులు, ఉపన్యాసకులు, విద్యావేత్తలు అయిన   ఆలోచనాపరుల్ని మాత్రమే గ్రూపులో చేర్చండి. 

రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక  రంగాల్లో   ముస్లిం సమాజపు అభ్యున్నతి కోసం వాళ్ల నైపుణ్యంవున్న ప్రక్రియలతో  నిరంతరం కృషిచేస్తుండాలని  వాళ్ళకు స్పష్టంగా చెప్పండి.  నిత్యం సోషల్ మీడియాలో  ముస్లిం అనుకూల పోస్టింగులు పెట్టడం,  మతత్త్వశక్తుల విధానాలను  ఖండించడం, సానుకూల పోస్టింగుల్ని షేర్ చేయడం సభ్యుల ప్రాధమిక కర్తవ్యం. 

సంస్థ కోసం సమయాన్నీ, శ్రమను, వనరుల్ని  వెచ్చించడం సభ్యుల మలి కర్తవ్యం.  

తమ ఆలోచనా నైపుణ్యాన్ని, సమయాన్నీ, శ్రమను, వనరుల్ని  సంస్థ కోసం వెచ్చించని సభ్యుల్ని గ్రూపు నుండి తొలగించివేయండి. 

ఈ నాలుగు పనులు చేయనివాళ్ళు వాళ్ల స్వంత ఎజెండాను చర్చకు తెచ్చి సంస్థ సమయాన్ని పాడు చేస్తుంటారు. అలాంటి వాళ్లను గ్రూపులో చేర్చవద్దు.  ఒకవేళ పొరపాటుగా చేర్చినా వాళ్లను మీరే బాధ్యతగా తొలగించివేయండి. ఈ మత ప్రచారకులు మన గ్రూపులోనే ఇంకో ఉప గ్రూపును నిర్మించే ప్రయత్నం చేస్తారు. మనం పని వత్తిడిలో వున్నప్పుడు ఈ ఉపగ్రూపు ఒక అసందర్భ చర్చతో మన సమయాన్ని హైజాక్ చేస్తుంది. మన పనిని పాడు చేస్తుంది. ఈ రోజు మత చర్చను రేపినవారు ఇంత వరకు సంస్థ కోసం ఏపనీ చేసినవారు కాదు. అలాంటి వాళ్ళ విషయంలో  జాగరూకతతో వుండండి. 


ఇన్ క్లూసివ్ నెస్ అంటే  స్థూలంగా ఏకాభిప్రాయం వుండి వైవిధ్యాన్ని ఆమోదించడం మాత్రమే. అంతేగానీ, కార్డియాలజీ సమస్య వున్నవాళ్ళను  ఆర్ధోపేడిక్ హాస్పిటల్ లో చేర్చుకోవడం కాదు.  



ఇది ధార్మిక సంస్థ కాదు అంటూ వందసార్లు చెపుతుంటే అర్ధం కాదా? తిరిగి తిరిగి ధార్మిక అంశాలనే ఎజెండా లోనికి తేవడం దురుద్దేశం కాకమరేమిటీ? లోకంలో కోటిన్నర ధార్మిక సంస్థలున్నాయి. అక్కడ మీ ప్రతిభను ప్రదర్శించండి. ఇక్కడి నుండి తొలగిపొండి. 





లను గ్రూపులోనికి ఎవరు చేర్చారూ? ముందు వాళ్లను తొలగించండి. వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు మన సంస్థ కోసం ఒక్క పనీ చేసిందీ లేదు. 
ఈ చర్చ ఇప్పుడు  మళ్ళీ ఎలా ముందుకు వచ్చిందో తెలీదు.  అనేక ప్రతిపాదనల్ని పరిశీలించిన తరువాతే Muslim Thinkers Forum  సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ను తమ ICON గా ఎంచుకుంది. 

చారిత్రక పురుషులు ప్రతి ఒక్కరిలో కొన్ని పరిమితులు ఎలాగూ వుంటాయి. వాటిల్లో చారిత్రక పరిమితులు ప్రధానంగా  వుంటాయి. ఆధునిక విద్య రంగప్రవేశం చేసినపుడు ధనిక సమూహాలకే విద్యారంగంలో ప్రవేశ అర్హత వుంటుంది.  అది క్రమంగా దిగువ శ్రేణులకు కూడా విస్తరిస్తుంది. 

 కమ్యూనిస్టులు సహితం మార్క్స్ నుండి రావి నారాయణ రెడ్డి వరకు ఓ డజను ఫొటోలు పెట్టుకుంటున్నారు. అయినా  ఆద్యుడు మార్క్స్ మాత్రమే. దళిత బహుజనులు మొదట్లో అంబేడ్కర్ ఫొటో ఒక్కటే పెట్టుకునేవారు. ఇప్పుడు వాళ్ల మహాత్ముల ఫొటోలు డజను వరకు వుంటున్నాయి.  

20వ శతాబ్దంలో   అనేక మంది ముస్లిం ఆలోచనాపరులు అనేక ప్రత్యేక రంగాల్లో  గొప్ప కృషి చేశారు. అభిమానులు సహజంగా  తమకు నచ్చిన వారి ఫొటోలు పెట్టుకుంటుంటారు.  అయితే, ఆధునిక భారత ముస్లింలకు సంబంధించి ఆద్యులు Sir Syed Ahmad Khan గారే. తొలి ICON వారే. వారి పక్కన ఎన్నిఫొటోలు అయినా వుండవచ్చు. 

అసలు విషయం ఏమంటే ఇలాంటి అంశాలు చర్చలతో తేలవు. ఉద్యమాలు విస్తరించినపుడు కొత్తగా కలసి వచ్చే శ్రేణులు, సమూహాల మనోభావాలు, భావోద్వేగాలకు అనుగుణంగా మహాత్ముల ఫొటోలు కూడా  విస్తరిస్తాయి.  ఇప్పటికీ Muslim Thinkers Forum ఒక ఆలోచనాపరుల సంస్థేగానీ ఉద్యమ సంస్థకాదు. 

Standard expenses for meeting
1. Function Hall  for 50-75 Rs. 2500
2. Table arrangements Rs. 500
3. Remote Microphones Rs. 200
4. AC and Power charges Rs. 1000
5. Hall Clearing Cost Rs. 500
6. Flexies Design & Printing Rs. 800
7. Water, Tea & snacks  Rs. 750
8. Lunch 50-60 members Rs. 6000
9. Hotel Rooms 2 Rs. 2000
10. Travelling for Special Guest Rs. 1000
11. Media Hospitality Rs. 1000
12. Unseen expenditure Rs. 950
Total Expenditure Rs. 17200

We can deduct lunch and bargain hall rent ect; to drastically reduce the expenses.  


Contributions and Expenditure 
I am herewith presenting the Contributions and Expenditure of MTF in day book form as on 18th April 2018 for the public auditing. 

You may bring to my notice if any of your contribution is not entered in the books. You have every right to elevate your objection if you feel about any entry of the expenditure is inappropriate. 

- Danny 

మిత్రులారా ! 
ఒక్కోసారి మీరు చూపే అతిఉత్సాహానికి ఆనందం వేస్తుంది. అంతలోనే భయమూ వేస్తుంది. మనం ఏ పనిచేయాలన్నా వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేసుకోవాలి. ప్రకటిత లక్ష్యాలను ముందు నెరవేర్చాలి. ఆ తరువాతే ఇతర అంశాలను ఎజెండాలో చేర్చాలి. 

మనది ఆలోచనాపరుల వేదిక. ముస్లిం సమాజానికి ఒక సామాజిక, రాజకీయ, ఆర్ధిక దృక్పథాన్ని అందించడం మన లక్ష్యం.  రచనలు, సభలు, సమావేశాల ద్వార దాన్ని మనం సాధిస్తాం. ముందు ఈ మూడు పనుల్ని మనం అధిగమించిన తరువాత విస్తరణ పథకాలు   చేపట్ట వచ్చు.

మన సభ్యులే కొందరు టీవీ ప్రమోటర్లుగా వున్నారు. అలాగే మరి కొందరు మిత్రులు  ఒక దిన పత్రిక తెచ్చే సన్నాహాల్లో వున్నారు. మీడియాలో మన ప్రాతినిధ్యాన్ని పెంచడానికి ఒక జర్నలిజం స్కూలును పెట్టె ప్రయత్నంలోనూ కొందరున్నారు. ఇంకొందరు ఒక వార పత్రిక  లేదా ఒక  మాస పత్రికను తెచ్చే ప్రయత్నాల్లో వున్నారు. 

మన ప్రకటిత లక్ష్యాలైన మూడు పనుల్ని చేసిన తరువాత  మన సభ్యుల దగ్గర మరింత ఆర్ధిక వనరులు, మానవ శ్రమ సమయం వుంటే తొలుత   వాళ్లందరితో సహరించండి. ఆ తరువాత కూడా  మానవ వనరులు, ఆర్ధిక వనరులు వుంటే మనమే ఆయా రంగాలలోనికి విస్తరించవచ్చు.  మొదటి కర్తవ్యాలనే నెరవేర్చడం సాధ్యకానపుడు కొత్త రంగాల గురించి ఆలోచించడం నేల విడిచిన సాము అవుతుంది. అందులో గాయాలు తగలడం తప్ప ఫలితాలు వుండవు. 

మన సభ్యుల్లో కేవలం ఒక అరడజను మంది మాత్రమే రచనలు చేస్తూ,   సభలు, సమావేశాలు నిర్వహించే  బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. 

కేంద్ర నిర్వహణకు  ఏప్రిల్ 2017 నుండి మే 2018 వరకు అంటే గత 14 నెలల్లో వచ్చిన మొత్తం  విరాళం 30 వేల రూపాయలు. అంటే నెలకు 2143 రూపాయలు. ఇంత తక్కువ మొత్తంతో మనం ఏఏ పనులు చేయగలమో ఊహించగలరు. 

మే నెల ఆరంభంతో  సాధారణ ఎన్నికల సంవత్సరం మొదలయిపోయింది. మన కార్య క్రమాలు పెరుగుతాయి.  ఇతర అణగారిన సమూహాల కార్యక్రమాలు కూడా పెరుగుతాయి. మనం జాతీయ స్థాయిలోనూ కొన్ని సంబంధాలను  పెట్టుకోవాల్సి వుంటుంది. మనం వాటిల్లో చురుగ్గా  పాల్గోవాలంటే నెలకు కనీసం 10 నుండి 15 వేల రూపాయలు అవసరం అవుతాయి. ఈ లోటును పూడ్చే ప్రయత్నం చేయండి. ఆ తరువాత కూడా మనకు ఆర్ధిక స్తోమత వుంటే ఇతర  పనులు చేపడదాం. ఆలో చించండి. 

కేంద్ర నిర్వహణకు విరాళాలు ఇవ్వదలచినవారు నా Bank Accountకు Money tranfer చేసి ఆ వివరాలను  Groupలో Post చేయండి.  ప్రతినెలా చివరి రోజున నేను జమాఖర్చులు బహిరంగంగా  ప్రకటిస్తాను. సభ్యులు e-mail ID ఇస్తే వాటికీ పోస్ట్  చేస్తాను. 


Name :         A M KHAN YAZDANI 
SB a/c No.    911010054514777
Bank             Axis Bank Ltd.
Branch          Jubilee Hills, Hyderabad 
IFS Code       UTIB0000030

- డానీ 










ICON 
భారత ముస్లిం సమాజపు ఆధునిక సంస్కర్త సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. వారు  అలిఘర్ లో 1817 అక్టోబర్ 17 న జన్మించారు, అప్పటి బ్రటీష్ వలస ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూనే వలస పాలిత ముస్లిం సమాజం కోసం, వారి అభివృద్ది కోసం అపార కృషి చేశారు. 
బ్రిటీష్ ఇండియాలో ముస్లింలు అభివృధ్ధి చెందాలంటే ఇంగ్లీషు విద్య ఒక్కటే సాధనం అని  గుర్తించిన ఆలోచనాపరుడు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ . రాబోయే రోజుల్లో సమాజాన్ని విద్యావంతులే  శాసిస్తారు కనుక ముస్లింలు ఇంగ్లీష్, సైన్సు, మాథ్స్ ను తప్పకుండా చదవాలని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ 19వ శతాబ్దంలోనే ప్రభోదించేవారు. ఇంగ్లీష్ లో పుస్తకాలు తెప్పించి వాటిని అనువాదింపజేశారు. సైన్సు సొసైటీని స్థాపించి విజ్ఞాన శాస్రాలను ప్రచారం చేశారు.  
అప్పట్లో చాలా మంది ఆంగ్లాన్ని వలస పాలకుల భాష అని విమర్శించేవారు. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  అలాంటి విమర్శల్ని పట్టించుకునేవారుకాదు.  తనది ఆంగ్లం భాషా  వ్యామోహం కాదనీ,  వర్తమాన విజ్ఞాన శాస్త్రాలు ఆ భాషలోనే వున్నాయని వివరించావారు.  మదన మోహన మాలవ్య బెనారస్ హిందూ యూనివర్శిటీని  స్థాపించడానికి ముందే 1875లో సయ్యద్ అహ్మద్ ఖాన్ మొహమ్మడన్ ఆంగ్లో ఇన్ స్టిట్యూట్ ని స్థాపించారు. అదే ఆ తరువాతి కాలంలో  అలిఘర్ ముస్లిం యూనివర్సిటీ గా అభివృధ్ధి చెందింది. ఇంగ్లీషు పాలకుల్ని ఇంగ్లీషుతోనే జయించాలని గుర్తించిన తొలి భారతీయుడాయన.  
దళిత సంస్కర్త బీఆర్ అంబేడ్కర్ కూ,  ముస్లిం సంస్కర్త సయ్యద్ అహ్మద్ ఖాన్ కూ ఒక పోలిక వుంది. అణగారినవర్గాల విముక్తికి ఇంగ్లీషు విద్య ఉపయోగపడుతుందని ఇద్దరూ చాలా బలంగా భావించేవారు. 
 సయ్యద్ అహ్మద్ ఖాన్ ను స్పూర్తిగా తీసుకుని ఏర్పడిన ముస్లిం ఆలోచనాపరుల వేదిక  (ఎంటిఎఫ్) ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, ఆదివాసులు, బలహీనవర్గాలు, తదితర అణగారిన సమూహాల ఆత్మగౌరవం కోసం కృషిచేస్తుంది. జై భీం !  జై మీం !  మా నినాదం.  నీలం జెండా, ఆకుపచ్చ జెండా, ఎర్రజెండాలు కలిసి ఎగరాలనేది మా ఆశయం.  మతసామరస్యం మా లక్ష్యం


సయ్యద్ అహ్మద్ ఖాన్ తో పాటూ 
1. అష్ఫఖుల్లా ఖాన్
2. మౌలాన అబుల్ కలాం ఆజాద్ 
3. ఆగా ఖాన్ – 3 
లను కూడా మన ఐకాన్ లా వాడవచ్చు. 


పలకరింపు Greeting 

జై మీమ్ – జై భీమ్ 


మీమ్ అనేది ముస్లింకు సంక్షిప్త రూపం( Acronym)
ఉర్దూ, అరబ్బీ భాషల్లో ముస్లిం పదం మీమ్ అనే అక్షరంతో మొదలవుతుంది. 

జై మీమ్ – అంటే ముస్లింలకు జయము కలుగుగాక అనే అర్ధం.  
మీమ్ ను  మైనార్టీలకు Acronymగా కూడా వాడవచ్చు. 
అలాగే  మీమ్ ను  సందర్భాన్నిబట్టి ప్రవక్త ముహమ్మద్ (వారికి శాంతి కలుగుగాక) గారికి  Acronymగా కూడా వాడవచ్చు. 

భీం – అంటే భీం రావ్ అంబేడ్కర్. 
జై భీం – అంటే భీం రావ్ అంబేడ్కర్ కు జయము కలుగుగాక అని అర్ధం.
ఇటీవల ఆదివాసులు కొమురం భీంకు జయము కలుగుగాక అని అర్ధంలో వాడుతున్నారు. రెండూ మనకు ఆమోదయోగ్యమే.


Flag (proposal) 

మన జెండా మూడు రంగులది.

ఆకుపచ్చ, నీలం, ఎరుపు మూడు రంగులూ సమానం. 

4 అడుగులు వెడల్పు 6 అడుగులు పొడవు. 

భారత అణగారిన  సమూహాలకు అది చిహ్నం. 




హైదరాబాద్
18 మే 2018


MTF Group  మిత్రులందరికీ 
రంజాన్ ముబారక్  

మనం రంజాన్ మాసంలో విశ్రాంతి తీసుకోవడంలేదు. ఇఫ్తార్ విందుల్లో ముస్లిం, క్రైస్తవ, దళిత, ఆదివాసి, బహుజనులు, ఇతర బలహీనవర్గాల ఐక్యత కోసం కృషి చేద్దాం. తూర్పు గోదావరి, అనంతపురం, గుంటూరు జిల్లాల ప్రతినిధులు ఇప్పటికే ఇఫ్తార్ కార్యక్రమాలు ప్రకటించారు. హైదరాబాద్ లోనూ ఇఫ్తార్ కార్యక్రమాన్ని చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. 

దీన్ని భారీగా చేయాల్సిన పనిలేదు. మీ ఆర్ధిక శక్తి మేరకు ప్లాన్ చేసుకోండి. మీకు వీలైన ఒక రోజు  సాయంత్రం ఇఫ్తార్ సమయానికి  క్రైస్తవ, దళిత, ఆదివాసి, బహుజనులు, ఇతర బలహీనవర్గాల్ని మీ ఇంటికి పిలవండి. అణగారిన సమూహాలు ఐక్యం కావలసిన అవసరాన్నీ, MTF కార్యక్రమాల్నీ వివరించండి.

మీకు వీలయితే వాళ్ల వాడల్లోనే ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది. స్థానికంగా ప్రోత్సాహం లభిస్తే  ఒకటికన్నా ఎక్కువసార్లు ఎక్కువ వాడల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయండి. 

మీరు MTF  కార్యక్రమాలు ఏవిచేసినా MTF group messengerలో, మీ Face Book Wall మీదా తప్పక photos పెట్టండి. మనమ గొప్ప పనులు చేస్తే సరిపోదు మనం చేసిన పనులు ప్రపంచానికి తెలియాలి. అవి కొత్తవారికి ఉత్సాహాన్ని ఇచ్చి మన సంస్థ విస్తరణకు తోడ్పడతాయి. 

రంజాన్ నెలలోనే మనం మరో రెండు కీలకమైన కార్యక్రమాల్ని చేపట్టబోతున్నాం.  కీలక సభ్యులతో చర్చలు జరుగుతున్నాయి.  ఆ వివరాలు రేపు ప్రకటిస్తాను. 

- డానీ 

హైదరాబాద్
19 మే 2018

MTF Group  మిత్రులందరికీ 
రంజాన్ ముబారక్ 

'అణగారిన సమూహాలతో ఇఫ్తార్ సంగమం' తోపాటూ   మరో రెండూ కీలక కార్యక్రమాలు రంజాన్ మాసంలో  మనం చేపట్టాల్సిన అవసరంవుంది. 

ముస్లింల ఎన్నికల పంథా - మేధోమధనం

"2019 సాధారణ ఎన్నికల్లో ముస్లింలు అనుసరించాల్సిన రాజకీయవ్యూహం ఏమిటీ?" అనేది చాలా కాలంగా మన గ్రూపు సభ్యుల్నీ, బయటి సమాజాన్నీ వెంటాడుతున్న ప్రశ్న. ఆలోచనాపరులుగా ఈ ప్రశ్నకు మనం సకాలంలో సరైన కార్యక్రమాన్ని ప్రకటించాల్సివుంది.   కేవలం ఈ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించడానికి కనీసం రెండు రోజులు మేధోమధనం జరపాలి. మన సంస్థ క్రియాశీల సభ్యులే కాకుండా,  MTF  కు బయటవున్న  ముస్లిం ఆలోచనాపరుల్ని కూడా ఈ సదస్సుకు ఆహ్వానించాలి. 50 - 100 మంది ముస్లిం ఆలోచనాపరులతో జరిగే  ఈ సదస్సును ప్రకాశం జిల్లా మిత్రులు నిర్వహించే అవకాశాలున్నాయి. 

ఈ సదస్సు నిర్వహణ సంఘానికి @nabi karim Khan అధ్యక్షులుగా వుంటారు. @wahed @ Asifuddin @khalida Parveen  ముగ్గురూ  resource persons గా వ్యవహరిస్తారు. 

దళిత, ఆదివాసి, బహుజన, శ్రామిక, హిందూ ఉదారవాదులైన  ఐదుగురిని ఈ సదస్సుకు  సౌహార్ధ ప్రతినిధులు ( Fraternal delegates) గా  ఆహ్వానించాలనే ఒక ప్రతిపాదన వుంది. దీని మీద మీ అభిప్రాయాలు చెప్పండి. 

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి  సలహాలు సూచనలు ఇవ్వండి.  

Note :  ఈ అంశం మీద చర్చ జరుగుతున్నంత సేపూ ఇతర POSTS ఏవీ పెట్టవద్దు. చర్చ పక్కదారి పడుతుంది. 

- డానీ 


మిత్రులారా !
మీరంతా ఈరోజు ఈ అంశం మీదనే చర్చించండి. రేపు మరో ఉత్సాహకరమైన కార్యక్రమాన్ని ప్రకటిస్తాను.

- డానీ 

@Umar Harooq Khan గారూ !  త్వరలో హైదరాబాద్ లోనూ సభ వుంటుంది.  కానీ, రాజకీయ దృక్పధాన్ని తేల్చే సదస్సు ఒంగోలు లోనే జరపక తప్పదు. వంద మందితో రెండు రోజులు  అంటే పెద్ద ఖర్చు వుంటుంది. మనకు అక్కడే దాతలు వున్నారు. 

2019 ఎన్నికల్లో  ఏపి, తెలంగాణ ముస్లింలు 
ఎవర్ని ఓడించాలీ ? ఎవర్ని గెలిపించాలి? 

2019 ఎన్నికల్లో  ముస్లింల వ్యూహంపై
మేధోమధన సదస్సు  

MTF Messenger Group లోని ప్రతి సభ్యులూ తమ జిల్లాలోని ముస్లిం ఆలోచనాపరుల పేర్లు, Contact mobile phone Nos. వెంటనే ఇవ్వండి. 





హైదరాబాద్
19 మే 2018

MTF Group  మిత్రులందరికీ 
రంజాన్ ముబారక్ 

మిత్రులారా! 

 వర్తమాన సమాజ, రాజకీయ, ఆర్ధిక అంశాల మీద మన  group సభ్యుల అవగానను పెంచాల్సిన అవసరం వుంది. MTF  లక్ష్యాలు, పరిధి-పరిమితుల గూర్చి కూడా వివరించాల్సిన అవసరం వుంది.  దీనికోసం శిక్షణా తరగతులు నిర్వహించాలి. శిక్షణా తరగతులు అంటే కనీసం ఐదు రోజుల వ్యవహారం. (నేను 10 రోజుల శిక్షణా తరగతులకు హాజరయ్యాను. అది నా అవగాహనను  చాలా పెంచింది) 

ప్రస్తుతానికి ఈ కింది అంశాలు నా దృష్టిలో వున్నాయి. 

1. MTF  లక్ష్యాలు, పరిధి-పరిమితులు 
2. భారత ముస్లింల రాజకీయ చరిత్ర.
3. రాజ్యాంగం-న్యాయవ్యవస్థలో  ముస్లిం వివక్ష
4. విద్య, ఉపాధీ, ఆర్ధిక రంగాల్లో ముస్లీంల అణిచివేత - రిజర్వేషన్ల సాధన  
5. అణగారిన సమూహాల ఐక్యతా ఆవశ్యకత 

రాజకీయ శిక్షణా తరగతులకు ఆతిథ్యం ఇవ్వడానికి తూర్పు గోదావరి జిల్లా యూనిట్ ఉత్సాహంగా వుంది.  

వీటి మీద మీ సూచనలు సలహాలు ఇవ్వండి. 

- డానీ 

ముస్లిం- దళిత్ ఇఫ్తార్ పార్టి ఆలోచన రాగానే ఆచరణలో పెట్టేసిన మన @Hasan   కు అందరూ అభినందనలు తెలపండి. 



హైదరాబాద్
19 మే 2018

మిత్రులారా!
ఒంగోలు రాజకీయ సదస్సు కోసం సన్నాహాక చర్చలు చురుగ్గా సాగుతున్నాయి. మన కో-కన్వీనర్ @nabi  అక్కడ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం conference phone call మీద  ఆర్ధిక దాతలతో ప్రాధమిక చర్చలు జరిగాయి. రెండు మూడు రోజుల్లో ఒంగోలులో MTF, బరవే ప్రతినిధులు,  ఆర్ధిక దాతలతో రెండవ విడత చర్చలు జరుగుతాయి.  ఆ సమావేశంలో సభ నిర్వహణ విషయంలో స్పష్టమైన దృశ్యం మన ముందుకు వస్తుంది.  

రంజాన్ మాసం లోనే సదస్సు జరపాలనీ, సభా ప్రాంగణంలోనే సహేరీ, ఇఫ్తార్, నమాజ్ ఏర్పాట్లు చేయాలని ప్రాధమిక ప్రయత్నాలు మొదలయ్యాయి. 

సభ నిర్వహణ విధివిధానాల గురించి నా ప్రతిపాదన రేపు చేస్తాను.

వారం క్రితం నేను కోరగానే రంగంలో దిగిపోయిన మన @ Nabi కు అందరూ అభినందనలు చెప్పండి. 

- డానీ 


హైదరాబాద్
20 మే 2018

MTF Group  మిత్రులందరికీ 
రంజాన్ ముబారక్ 

మిత్రులారా! 

 వర్తమాన సమాజ, రాజకీయ, ఆర్ధిక అంశాల మీద మన  group సభ్యుల అవగానను పెంచాల్సిన అవసరం వుంది. MTF  లక్ష్యాలు, పరిధి-పరిమితుల గూర్చి కూడా వివరించాల్సిన అవసరం వుంది.  దీనికోసం శిక్షణా తరగతులు నిర్వహించాలి. శిక్షణా తరగతులు అంటే కనీసం ఐదు రోజుల వ్యవహారం. (నేను 10 రోజుల శిక్షణా తరగతులకు హాజరయ్యాను. అది నా అవగాహనను  చాలా పెంచింది) 

ప్రస్తుతానికి ఈ కింది అంశాలు నా దృష్టిలో వున్నాయి. 

1. MTF  లక్ష్యాలు, పరిధి-పరిమితులు 
2. భారత ముస్లింల రాజకీయ చరిత్ర.
3. రాజ్యాంగం-న్యాయవ్యవస్థలో  ముస్లిం వివక్ష
4. విద్య, ఉపాధీ, ఆర్ధిక రంగాల్లో ముస్లీంల అణిచివేత - రిజర్వేషన్ల సాధన  
5. అణగారిన సమూహాల ఐక్యతా ఆవశ్యకత 

రాజకీయ శిక్షణా తరగతులకు ఆతిథ్యం ఇవ్వడానికి తూర్పు గోదావరి జిల్లా యూనిట్ ఉత్సాహంగా వుంది.  

వీటి మీద మీ సూచనలు సలహాలు ఇవ్వండి.


గోరక్షకులు !
మనుషుల్ని మాత్రమే చంపుతారు !  


23-5-2018

@Umar Farooq గారూ ! అస్సలాం అలేకుం! 

మనం ఈ groupలో రెండు పనులు చేస్తున్నాం. మొదటిది; మతతత్త్వశక్తుల దుర్మార్గాలను ఎండగడుతూ వాళ్ళ రాజకీయ విస్తరణను బలహీనపర్చడం. ఇది విధ్వంసం. రెండవది; అణగారిన సమూహాలకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ వాళ్ళ ఐక్యతకు కృషిచేయడం. ఇది నిర్మాణం.  

అంతకు మించిన Postsను అతిఉత్సాహంతో ఈ group  లో పెట్టవద్దు. 

@Khalida Parveen గారూ ! అస్సలాం అలేకుం! 
మీ అభ్యంతరం ఏఏ పోస్టుల మీదా? దానికి కారణం ఏమిటీ? 





మనలో అనేక రాజకీయ పార్టీల అభిమానులు సభ్యులుగా వున్నారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. 





 మతతత్త్వశక్తుల్ని, ప్రధానంగా సంఘ్ పరివారాన్ని బలహీన పరిచే విషయాలను  




చైనా కుటుంబ నియంత్రణను ఎత్తివేయడం MTFకు అనుకూలమైన అంశం ఏమీకాదు. అలాగే భారత సైన్యంలో ముస్లింలు వుండడం కూడా ఆశ్చర్యకర విషయం కాదు. జనసేన పార్టి నిర్మాణంలో సోషల్ ఇంజినీరింగ్ కూడా మనకు చర్చనీయాంశం కాదు.  


@umar Farooq గారూ !  మీ తక్షణ సవినయ  స్పందనకు ధన్యవాదాలు. 

25-5-2018

మిత్రులారా ! 

ముస్లీంలు దళితులు, ఆదివాసులతో  కలిసి ఇఫ్తార్ దావత్ లు జరిపుకోవాలన్న MTF పిలుపు మహత్తరమైనది. దీనికి మంచి స్పందన కూడా వస్తున్నది.  అయితే ఈ విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

నమాజ్ చేసే ముస్లింలు చాలా పరిశుభ్రతను పాటిస్తారు. రంజాన్ మాసంలో ఇది మరీ ఎక్కువగా వుంటుంది. అయితే, దళితవాడలు సాధారణంగా మనం ఆశించినంత పరిశుభ్రంగా వుండవు. అంచేత కొన్ని ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. ముస్లింల పరిశుభ్రత స్థాయిని MTF తగ్గించేసిందనే అపఖ్యాతి మనకు రాకూడదు. కాకినాడ నుండి నుండి వచ్చిన ఒక ఫొటోలో జనం ముందు ఒక కుక్క తచ్చాడుతూ వుంది. అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. నేనూ కూడా గమనించకుండా ఆ ఫొటోను SHARE  చేసేశాను. ఇక నుండి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. 

- డానీ 

నేను మన @H ను తప్పు పట్టడంలేదు. MHPS  ఖాజా వలి FBలో ప్రతికూలంగా స్పందించాడు. నాకూ బాధే వేసింది. మనం అలాంటి అవకాశం ఇవ్వకూడదనే జాగ్రత్తలు చెప్పాను. 



 @ గారూ ! మనం ఏ పని చేసినా కొన్ని విమర్శలు వుంటాయి. సాధ్యమయినంత వరకు మనం అలాంటి అవకాశం ఇవ్వొద్దు. మీరు చాలా శ్రమిస్తున్నారు. Go AHEAD ! 

@umar Farooq గారూ!  మీరు చేస్తున్న కృషికి అభినందనలు. మీరు అలాగే కొనసాగించండి. 

“బ్రదర్ !  ఇది ఇఫ్తార్ దావత్ కు దళితవాడలో పిలుపు దృశ్యం. దళితవాడలు అలాగే వుంటాయి. నమాజ్, దావత్ కోసం పరిశుభ్రమైన స్థలాలనే ఎంచుకుంటున్నారు”.  
నేను ఖాజా వలికి సున్నితంగా సమాధానం ఇచ్చాను.

మిత్రులారా !
బీజేపి ఒక కాగితపుపులి. Paper Tiger. కేవలం విపక్షాల అనైక్యతే దాని బలం, గెలుపు. దేశంలో దానికి 31 శాతం ఓట్లు మాత్రమే వున్నాయి. అందులోనూ చాలా వరకు మాయ చేసి, భ్రమల్లో పెట్టి సాధించిన ఓట్లు. వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజక వర్గంలోనూ బీజేపి మీద ఒక్క ప్రత్యర్ధి మాత్రమే వుండేలా చేయగలిగితే బీజేపికి ఒక్క సీటు కూడా రాదు. ఈ వ్యూహాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి ? అనేది ఇప్పుడు ఆలోచించాలి. 


Muslim Meeting To decide Political Stand 
మిత్రులారా!

జై మీమ్!   

విషయం - ‘ముస్లిం రాజకీయ విధాన నిర్ణయ సదస్సు’.

28 మే 2018 సోమవారం ఒంగోలులో MTF  కీలక సమావేశం జరిగింది. 
2019 సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముస్లింలకు ఎలాంటి  దిశానిర్దేశనం చేయాలనేది ఈ సమావేశం లక్ష్యం. 

MTF కన్వీనర్ స్థాయిలో ఏ. యం. ఖాన్ యజ్దానీ (డానీ), కో-కన్వీనర్ స్థాయిలో నబీ కరీం ఖాన్, MTF ప్రకాశం జిల్లా సభ్యుడు రసూల్ ఖాన్, FDCA నాయకులు కేయం సుభాన్,  బరవే నాయకుడు నూకతోటి రవికుమార్, స్థానిక విద్యాసంస్థకు చెందిన షేక్ అబ్దుల్ (SA)  కరీముల్లా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

పార్లమెంటరీ రాజకీయ పార్టీలు గతంలో ముస్లింలను కనీసం ఓటు బ్యాంకుగా భావించేవారనీ ఇప్పుడు ఆ గుర్తింపు కూడా పోయిందని సమవేశం అభిప్రాయపడింది. మతతత్త్వ శక్తులు భారత ముస్లింలకు ప్రధాన శత్రువుక్లని సమావేశం ప్రటించింది. రాబోయే ఎన్నికల్లో మతతత్త్వ జాతీయ కూటమినీ,  వాటితో పొత్తులు పెట్టుకునే ప్రాంతీయ పార్టీల్ని ఓడించడం మన వ్యూహమని  కావాలని ఒక ఏకాభిప్రాయం వచ్చింది. అయితే “ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఎలాంటి ఎత్తుగడలు అనుసరించాలి?” అనే కీలక విధానాన్ని  రూపొందించడానికి  రాష్ట్రంలోని ముస్లిం ఆలోచనాపరులతో కనీసం రెండు రోజులపాటు ఒక విస్తృత మేధోమధన సదస్సు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. 

సమావేశం నిర్ణయాలు 
1. ఈ సదస్సు MTF ఆధ్వంలో జరుగుతుంది. 
2. రంజాన్ పండుగ జరుపుకున్న వారం రోజుల తరువాత దీన్ని నిర్వహిస్తాము. 
3. దీని వర్కింగ్ టైటిల్ ‘
4. ఈ టైటిల్ ను  మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు.  
5. ఇది ముస్లిం ఆలోచనాపరుల సదస్సు. సద్దసు నిర్వహణకు సోదర అణగారిన  సమూహాలు, సంస్థల సహకారం తీసుకున్నప్పటికీ సదస్సు చర్చల్లో కేవలం ముస్లిం ఆలోచనాపరులు మాత్రమే పాల్గొంటారు. 
6. (సంఘీయులుతప్ప) విభిన్న రాజకీయాల్లో, రాజకీయ పార్టీల్లో వున్న ముస్లింలు కూడా ఈ సదస్సులో పాల్గొనవచ్చు. 
7. ముఖ్యులైన ముస్లిం ఆలోచనాపరులు కొందరిని ప్రాధాన్యతను బట్టి పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఆహ్వానించవచ్చు. 
8. ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుండి నలుగురు చొప్పున  ముస్లిం ఆలోచనాపరుల్ని ప్రతినిధులుగా ఈ సమావేశానికి పిలిపించాలి. 
9. ముస్లిం సమాజంలోని ఖబీలాలు (BC-E జాబితాలో వున్నవారు, లేనివారు) అన్నింటికీ ప్రాతినిధ్యం కల్పించాలి. 
10. ఈ సదస్సు ఒంగోలులో జరుగుతుంది. 
11. MTF కో-కన్వీనర్ నబీ కరీం ఖాన్ ఈ సదస్సు నిర్వహణ బాధ్యునిగానూ,  ఆహ్వాన సంఘానికి  కార్యదర్శిగానూ వుంటారు. 
12. ఆతిథ్యం ఇచ్చే స్థానిక దాత  ఆహ్వాన సంఘానికి అధ్యక్షునిగా వుంటారు. 
13. సదస్సుకు సహకరించే బరవే, FDCA తదితర సంస్థల ప్రతినిధులు ఆహ్వాన సంఘంలో సభ్యులుగా వుంటారు. 

హైదరాబాద్ 
30 మే 2018 



మిత్రులారా !
ఒంగోలు సమావేశం గురించీ, ముస్లిం రాజకీయ విధాన నిర్ణయ సదస్సు’ గురించీ circular ను Musim Thinkers Forum Blog  లో పెట్టాను. మీరు దాన్ని ఈ కింది Link  ద్వార చదవండి. మీ అభిప్రాయాలను, సూచనలను అక్కడే రాయండి. 


మరింత మేలయిన మాధ్యమం దొరికే వరకు మన మేధో మధనం అంతా  MTF blog లోనే జరగాలి. Messemger ను  greeting, Chatting, తక్షణ, స్వల్ప సమాచారం కోసం  వాడుదాం. 


మీ అభిప్రాయాలను, సూచనలను blog లోనే రాయండి. చర్చ ఇక్కడే జరగాలి. 


వాహెద్ గారు సూచించిన  ‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ శీర్షిక బాగుంది. ఇంతకన్నా మంచిది వచ్చే వరకు ఇదే మన శీర్షిక.  

‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ సదస్సులో మనం రాజకీయ విశ్లేషణలు చేయడంలేదు. దానివల్ల ప్రయోజనమూ లేదు. ముస్లింల ఓట్లకు గుర్తింపు తేవడమే మన ఎత్తుగడ (Tactics) తక్షణ లక్ష్యం. ఒక పార్టీని గెలిపించ గలిగినా మనకు గుర్తింపు వస్తుంది. లేదా ఒక పార్టీని ఓడించ గలిగినా మనకు గుర్తింపు వస్తుంది. ఏది చేసినా చెప్పి చేయాలి. 

మనం ‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ సదస్సులో రూపొందించే ఎత్తుగడ (tactics) ఒక ఎత్తు; దాని గురించి చేసే ప్రచారం ఒక ఎత్తు. ఈ రోజు నుండే మన సభ్యులందరి వాల్ లోనూ ఈ ప్రచారం మొదలయిపోవాలి. ప్రతి రోజూ ఈ అంశం మీద ఒక పోస్టు వుండాలి. ముస్లిం సమాజంలో ఏదో జరిపోతున్నదని రాజకీయ పార్టీలన్నీ ఆలోచనలో పడాలి. మనవైపు చూడాలి. నేను ఈరోజే FBలో  పోస్టు పెడతాను.  ఇక  ప్రచార హోరు మొదలెట్టండి. 

నేను ఒక డేట్ కూడా ఇచ్చేస్తున్నాను. కంగారుపడి ఏకపక్ష నిర్ణయం అనుకోవద్దు. ప్రచారానికి ఇది అవసరం. అయితే అందరి సానుకూలతను బట్టి అవసరం అయితే  తేదీల్లో మార్పు చేసుకోవచ్చు.  

‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
ముస్లిం ఆలోచనాపరుల రాజకీయ విధాన నిర్ణయ సదస్సు
జూన్  24, 25 శని, ఆదివారాలు, ఒంగోలు 

నేను పోస్ట్ పెట్టేశాను.  దీనిని షేర్ చేయడం ఒక ఎత్తు; ఇదే మ్యాటర్ మళ్ళి మీరు కొత్తగా పోస్ట్ చేయడం ఒక ఎత్తు. ఏది ఎలా ఎక్కువ మంది చూస్తారు అనుకుంటే అలా చేయయండి. 


కొన్ని నినాదాలు ఇస్తున్నాను. మీరు మీ సృజనాత్మకతను బట్టి కొత్తవి సృష్టించండి. లేకుంటే ఇవే వాడండి. 

1.
‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
ముస్లిం ఆలోచనాపరుల రాజకీయ విధాన నిర్ణయ సదస్సు
జూన్  23, 24 శని, ఆదివారాలు, ఒంగోలు 

2.
2019 ఎన్నికల్లో ముస్లింలు ఎవరి పక్షం ?
‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
జూన్  23, 24 శని, ఆదివారాలు, ఒంగోలు 
3.
2019 ఎన్నికల్లో ముస్లింలు ఎవర్ని గెలిపిస్తున్నారూ? 
‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
జూన్  23, 24 శని, ఆదివారాలు, ఒంగోలు
4.
2019 ఎన్నికల్లో ముస్లింలు ఎవర్ని ఓడిస్తున్నారూ? 
‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
జూన్  23, 24 శని, ఆదివారాలు, ఒంగోలు
5.
ముస్లింల రాజకీయ విధానాన్ని రూపొందిద్దాం! 
‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
జూన్  23, 24 శని, ఆదివారాలు, ఒంగోలు

6.
 చలో ఒంగోలు 
‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
జూన్  23, 24 శని, ఆదివారాలు, ఒంగోలు

7.
‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) ఆధ్వర్యంలో 
జూన్  23, 24 శని, ఆదివారాలు, ఒంగోలు
8.
‘ఆంధ్రా ముస్లింలు : దశ- దిశ’ 
జూన్  23, 24 శని, ఆదివారాలు, ఒంగోలు
వివరాలకు : నబీ కరీం ఖాన్ 96661 92292

ముస్లింలకు ఒక రాజకీయ విధానం ఉండాల్సిందే. 

ఇంకా అభిప్రాయాలు రాయండి. 
 Please watch the post and offer you comments and suggestions. 

https://www.blogger.com/blogger.g?blogID=2823557698303711345#allposts/src=sidebar

రాష్ట్రంలో ముస్లింలు ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారో చెప్పడం మెయిన్ స్ట్రీమ్ మీడియా పని. లేదా సర్వే సంస్థల పని. ముస్లిం ఆలోచనాపరులు చెయ్యాల్సింది అదికాదు. ముస్లింలు ఎవరికి ఓటు వేయాలో  ముస్లీం ఆలోచనాపరులు చెప్పాలి. 

దళితుల మహానేత అంబేడ్కర్, ముస్లిం నాయకుడు జిన్నా, ద్రావిడ సంస్కర్త రామసామి 1939లో 
Back in 1939, the three respected figures of Indian self-determination movement – Jinnah, Ambedkar and Periyar met in Poona to contemplate the future course of action.

Ambedkar shares a history with the then Muslim icon Muhammad Ali Jinnah and Dravidian reformer Periyar Ramasamy.  

వలస పాలన కాలపు స్వయం నిర్ణయాధికార ఉద్యమాల మహానేతలు అంబేడ్కర్, జిన్నా, రామసామి మూడు సామాజిక శ్రేణుల భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించడానికి 1939లో పూనాలో సమావేశమయ్యారు. ఈ అంశం మీద నేను పరిశోధన చేస్తున్నాను. ఈ ముగ్గురి ఐక్యకార్యాచరణకు సంబంధించిన వివరాలు మీదగ్గర వుంటే తెలుపగలరు. 


A Challenge to Our Brains; We will Overcome !  
మన మెదళ్ళకు ఇదొక సవాలు. అధిగమిద్దాం.


ఆంధ్రప్రదేశ్ రాజకీయ సన్నివేశం
Magic Figure
1. శాసన సభలో మొత్తం స్థానాలు 175
2. అధికారానికి మేజిక్ ఫిగర్ 88

Present Status 
1. అధికారంలో తెలుగు దేశం పార్టీ వుంది.
2. ప్రతిపక్షంలో వైయస్సార్ సిపి వుంది.
3. బీజేపికి ప్రస్తుతం నాలుగు స్థానాలున్నాయి.  
4. సిపిఐ కు ఒక్క స్థానం కుడా లేదు.
5. సిపిఐఎం కూ ఒక్క స్థానం కుడా లేదు.
6. కాంగ్రెస్‍ కూ ఒక్క స్థానం కూడా లేదు.
7. జన సేనకూ  ఒక్క స్థానం కూడా లేదు.


Political  Permitations and Combinations 
1. టిడిపి విడిగా పోటీ చేయవచ్చు. 
2. వైయస్సార్ సిపి విడిగా పోటీ చేయవచ్చు.
3. బీజేపి విడిగా పోటీ చేయవచ్చు.  
4. సిపిఐ విడిగా పోటీ చేయవచ్చు
5. సిపియం విడిగా పోటీ చేయవచ్చు.
6. కాంగ్రెస్ విడిగా పోటీ చేయవచ్చు
7. జనసేనా విడిగా పోటీ చేయవచ్చు. 
8. బీయస్పీ రంగంలో దిగవచ్చు
9. ఎస్పీ రంగంలో దిగవచ్చు. 
10. ఒక కొత్త పార్టీ కూడా రావచ్చు. 
Pre-Poll Alliance Chances 
1. సిపిఐ, సిపియం పొత్తు పెట్టుకోవచ్చు. 
2. కాంగ్రెస్, సిపిఐ, సిపియం  పొత్తు పెట్టుకోవచ్చు.
3. జగన్, బీజేపి కలవవచ్చు
4. జగన్, బీజేపి, జనసేన కలవవచ్చు. 
5. జనసేన, కాంగ్రెస్, సిపిఐ, సిపియం  పొత్తు పెట్టుకోవచ్చు.
6. బయస్పీ, ఎస్పీ పొత్తు పెట్టుకోవచ్చు. 
7. బీయస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, సిపిఐ, సిపియం పొత్తు పెట్టుకోవచ్చు. 
8. టిడిపి, సిపిఐ, సిపియం పొత్తు పెట్టుకోవచ్చు. 
9. టిడిపి, సిపిఐ, సిపియం, కాంగ్రెస్  పొత్తు పెట్టుకోవచ్చు. 
10. టిడిపి, బీయస్పీ, ఎస్పీ, కాంగ్రెస్, సిపిఐ, సిపియం పొత్తు పెట్టుకోవచ్చు. 

Election Pattern   
1. బీజేపికి వున్నవి 32 శాతం ఓట్లే.
2. బీజేపి యేతర పక్షాలకు వున్నది 68 శాతం ఓట్లు.
3. ముస్లింల ఓట్లు నమోదు కాకుండా చేస్తారు. 
4. EVMలు బీజేపికి విధేయ సేవకులే.  
5. బహుముఖపోటీ జరిగితే గెలుపు బీజేపీదే.
6. ముఖాముఖి పోటీ జరిగితే బీజేపికి మేజిక్ ఫిగర్ రాదు. 
7. మేజిక్ ఫిగర్ లేకున్నా ఎన్నికల తరువాత మేజిక్ చేసి బీజేపి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. 

పైన పేర్కొన్న దాదాపు 40 అంశాలన్నీ  ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)  గ్రూపులో వున్న ప్రతి ఒక్కరికీ క్షుణ్ణంగా తెలుసు. ఒంగోలు దశ-దిశ సదస్సు ఈ నలభై అంశాలు బోధించడానికి కాదు. ఒక కొత్త ఫార్మూలాను కనుగొనడానికి. 

Formula –I
“ఓడిపోవాల్సిన ఫలానా చిన్న పార్టి ముస్లింలు మద్దతుఇవ్వడంవల్లనే గెలిచింది”  
అనిగానీ 
Formula - II
“గెలవాల్సిన ఫలానా పెద్ద పార్టి ముస్లింలు వ్యతిరేకించడంవల్లనే  ఓడిపోయింది”. 
అనిగానీ

ప్రపంచం అనుకోవాలి. 
అలాంటి ఎత్తుగడను రూపొందించడానికి ఆలోచనలు చేయండి. 

మన మెదళ్ళకు ఇదొక సవాలు. అధిగమిద్దాం. 

అభినందనలతో
- డానీ 


మన మెదళ్ళకు ఇదొక సవాలు. అధిగమిద్దాం. 
A Challenge to Our Brains; We will Overcome

కొత్త పోస్టు పెట్టాను. ప్రతి ఒక్కరూ స్పందించండి .
Abdul Wahed and Nabi Kareem Khan jointly will be working on Ongole deligates list.

We want to invite representatives from all 13 districts of Andhra Pradesh that includes all KHABILAS of Muslim brethren. 

This apart, we invite a half a dozen Muslim thinkers from neibouring state of Telangana also. 



Ongole Journey Plan 
Every deligate should reach Ongole on 23rd June  early morning 

For Deligates from Hyderabad, From Karimnagar, Warangal, Khammam on 22nd June 2018 
a. Charminar (18.30 Hrs)  b. Simhapuri (22.55 hrs)

For Deligates from Hindupur, Anantapur side
a. Prasanti (16 hrs) They have have to got down at Narasaraopet station and catch a bus for Ongole.
For Deligates from Visakhapatna and Srikakulam side
Visakha Madras SF (18.55 Hrs) 


‘ఆంధ్రా ముస్లింలు : దశ దిశ’ ఒంగోలు సదస్సుకు ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల నుండి చెరో నలుగురు చొప్పున 52 మందిని ప్రతినిధులుగా పిలుద్దాం. ఇంకో 8 మంది   ప్రముఖులైన వారిని రెండు రాష్ట్రాల నుండి ఎంపిక చేసి ఆహ్వానిద్దాం. మొత్తం 60 మంది. లీడర్స్ 20 మంది, యాక్టివిస్టులు 40 మంది. 

ఏ జిల్లా నుండి ఎవర్ని పిలవాలో మీరే సూచించండి.

ముందు కో కన్వీనర్లు అందరూ తమ చుట్టుపక్క జిల్లాల జాబితా ఇవ్వండి.  

1. శ్రీకాకుళం
2. విజయనగరం
3. విశాఖపట్నం
4. తూర్పు గోదావరి
5. పశ్చిమగోదావరి
6. కృష్ణా
7. గుంటూరు
8. ప్రకాశం
9. నెల్లూరు
10. చిత్తూరు
11. కడప
12. కర్నూలు
13. అనంతపురం 
14. తెలంగాణ 


హైదరాబాద్ నుండి
దేవీప్రియ
ఖాజ వినోద్ 



Hyderabad
31 May 2018

Dear MTF Members,
Assalam Alaikum,

MTF call for ‘IFTAR with DALITS’ has went very well among the both communities. Here the word DALIT is not be limited to SCs only; you should expand it to STs and BCs also. 

I am very happy to announce that with in a short perid of fourteen months our Muslim Thinkers Forum (MTF) has gained the confidence of Muslim brotherhood and other depressed communities as well. 

Now MTF activities have picked up momentum and there are numerous invitations from various corners of the states of Telangana and Andhrapradesh to expand our activities in their respective areas. 

As we have already entered in to the ELECTION YEAR, it will be our social, political and historical necessity to enter in to the national network.

But we are unable to meet the demand of expansion as we are suffering from paucity of funds.  Though there are about 90 members in our MTF Messenger group, only 12 members are contributing to meet the expenses of the organisation. While a few of them are regular contributers, others are accessional contributers. MTF received an amount of Rs. 35,000 since its foundation on 18th April 2017.  The average receipts towards contribution per month are just Rs. 2500 only. 

Hence I personally request every member to please contribute some amount of your convenient every month to the MTF. Please make an announcement today itself. 

Ignore this circular In case you are alredy in the contributers list and making contributions regularly. 

In case you want to transfer the contribution make it to the following bank account.

Danny Bank Account Details
Name :         A M KHAN YAZDANI 
SB a/c No.    911010054514777
Bank             Axis Bank Ltd.
Branch          Jubilee Hills, Hyderabad 
IFS Code       UTIB0000030


Thanking you,

With Regards

Danny 

MTF Messenger Group Members 
31-May-18
1 A.m. Khan Yazdani Danny
2 Abad Ali
3 Abdul Jabbar Siddiqi
4 Abdul Malik Shariq
5 Abdul Rajak Noor Basha
6 Abrar Mohd
7 Abu Bakr Siddique
8 Anwar Warangal
9 Apka Siddiq
10 Asifuddin Muhammed
11 Baba Pratibha
12 Dr Lubna Sarwath
15 Fayaz Ali
16 Gaffar Shaik Puliveedu
18 Gafoor Shikshak
19 Ghouse Mohiddin
20 Hamza Hussainy Syed
21 Haneef Mahammad Shaik
22 Haneef Syed
23 Hasan Sharief
24 Haseeb Ahmed
25 Iqbal Hussain
26 Jaha Aara
27 Janimiya Shaik
28 Jeelani Mohammed
29 Kalimullakhan Mahammad
30 Kareem Shaik
30.    Shaik Abdul Kareem
31 Kavi Karimulla Poet
32 Khaja Afridi
33 Khaja Miya
34 Khaja Vinod Husseni
35 Khalida Parveen
36 Khursheed Syed
38 Malik Motasim Khan
39 Malik Motasim Khan
40 Mazhar Rahman
41 Md Aziz
42 MD Ziauddin
43 Mohammad Ghouse
44 Mohammad Iqbal
45 Mohammed Abbas
46 Mohammed Abdulkhader
47 Mohammed Khan Pathan
48 Mohammed Shahnawaz
49 Mohd Fazul Rahaman
50 Mohd Ghouse Moinuddin
51 Mohibullah Khan
52 Muhammad Sharief
53 Muhammed Saleem Ahmed
54 Mujahid Pasha
55 Nabi Kareem Khan
56 Nasreen Khan
57 Noor Basha
58 Osman Khan
59 Rafeeq Muhammad
60 Rasool Khan
61 Rehana Begum
62 Remove
63 Rizwan Khan
64 Sabir Hussain Poet
65 Saleem Abdus
66 Sayeed Ahmed
67 Shaik Kareemullahsha
68 Shaik Meerahussain
69 Shaik Ruknuddin
70 Shaik Ruknuddin
71 Shukoor Miya
72 Smd Inayathulla
73 Smd Khasim
74 Snm Anwar
75 Syed Abdulmuqtadir
76 Syed Faqruddin Ali Ahmed
77 Syed Jeelani
78 Syed Mallick
79 Syed Naseer Ahamed
80 Syed Rafi
81 Syed Younus
82 Udugula Zareena
83 Umar Farooq Khan
84 Valihussain Mohmad
85 Vempalle Shareef
86 Wahed Abd
87 Waheed Mohammad
88 Zameer Shaik
89 Zubeda Hussain

Comments

Popular posts from this blog

Crusades - 1095–1291

*జిల్లాల్లోని ప్రధాన సమస్యల్ని పోస్టు చేయండి*

Ahmad Khan - French Revolution